ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి..
నయనతార,
అనుష్క కెరీర్ ప్రారంభంలో చేసిన గ్లామర్ రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. అందాల ఆరబోత విషయంలో అస్సలు తగ్గేవారు కాదు. కానీ ఆ పాత్రలు చేస్తున్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.ఓ దశలో వాళ్లకు లైఫ్ ఉండదనే కామెంట్స్ కూడా వినిపించాయి.కానీ ఆ తరువాత వాళ్ళు రూటు మార్చారు.
అనుష్క అరుంధతి సినిమాతోను, నయన్ శ్రీ రామరాజ్యం సినిమాతోనూ మంచి నటీమణులుగా ప్రేక్షకుల మదిలో తమ స్థానాన్ని ముద్ర వేసుకున్నారు. అక్కడి నుండీ గ్లామర్ పాత్రలను కాస్త తగ్గించి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ
అవసరమైతే డీ గ్లామరస్ పాత్రలకు కూడా నొ చెప్పకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సౌత్లో అత్యధిక పారితోషికం అందుకునేది ఈ ఇద్దరు హీరోయిన్లు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ ఇద్దరు
టాలీవుడ్ హీరోయిన్లు కూడా వీళ్ళనే స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. వారెవరంటే ఒకరు
హెబ్బా పటేల్ మరొకరు పాయల్
రాజ్ పుత్. మొన్నటి వరకూ ఈ భామలు గ్లామర్ షో విషయంలో అస్సలు తగ్గేవారు కాదు. కుర్రకారు మొత్తం వీరి గ్లామర్ ఫోటోలకు
ఫిదా అయిపోయేవారు.


ఇక
హెబ్బా అయితే ఐటెం సాంగ్స్ తో దుమ్ము రేపడానికి కూడా రెడీ అయిపోయింది. అయితే వీరిద్దరూ ఇప్పుడు డీ గ్లామరస్ రోల్స్ లో కనిపించడానికి కూడా రెడీ అయిపోయారు. గ్లామర్ పాత్రలు చెయ్యడం వలన ఎక్కువ ఫ్యూచర్ ఉండదని తెలుసుకున్నారో ఏమో.. ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో
హెబ్బా పటేల్, ‘అనగనగా ఒక అతిథి’ సినిమాలో
రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్
రాజ్ పుత్ డీ గ్లామరస్ పాత్రలు చెయ్యడానికి రెడీ అయ్యారు. వీళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నారా? లేదా? అన్నది ఆ సినిమాలు విడుదలైతే కానీ చెప్పలేము. ఇలాంటి మరిన్ని
సినిమా విషయాలు తెలుసుకోవడానికి
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.