ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ మరదలిగా నటించి చాలా బాగా ఆకట్టుకుంది తేజస్వి మడివాడ. ఆ సినిమాలో గోదావరి భాషలో మాట్లాడుతూ పక్కింటి అమ్మాయి లాగా నటించి ఎంతగానో అలరించింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ' చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ‘కేరింత’ సినిమాలో కూడా మంచి డీసెంట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది., ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంలో నిత్యామీనన్  కూతురి పాత్రలో నటించింది. ఇక గత సంవత్సరం బిగ్‌బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది తేజస్వి మదివాడ. ఇటీవల పూర్తిగా తెరమరుగైనపోయిన తేజస్విని మళ్లీ "కమిట్‌మెంట్" సినిమాలో నటించింది. ఆ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.ఈ మధ్య హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.


ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో తేజస్వి లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది.ఒక సీన్లో అయితే బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయింది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన రిలేషన్‌షిప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.తన గురించి  బోల్డ్‌గా చెప్పుకొచ్చింది.తన కెరీర్లో తొలిసారి లిప్‌లాక్ సీన్లలో నటించానని, గతంలో నటించిన ముద్దు సన్నివేశాలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది తేజస్వి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకున్నానని, అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది.


మళ్లీ అవకాశాలు రావడంతో పెళ్లి సంగతి పక్కన పెట్టేశానని, ఇక జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే తప్పులేదని, ప్రస్తుతం తానొక వ్యక్తిలో రిలేషన్లో ఉన్నానని తేజస్వి తెలిపింది. గతంలో తాను ఇద్దరితో డేటింగ్ చేశానని, పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: