కరోనా సీజన్ పూర్తయిందని చెప్పచ్చు. దీంతో జనాలు అందరు పెళ్లిళ్ల మీద పడ్డారు ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు. ఒక పక్క మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. మెగా డాటర్ నిహారిక పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగనుండడంతో ఈ పెళ్లి కోసం ఆ కుటుంబం అంతా రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చేరుకుంది. ఇక టాలీవుడ్ లో మరో కీలక కుటుంబం అయిన నందమూరి కుటుంబంలో కూడా పెళ్లి సందడి మొదలైందని చెప్పాలి. ఈ ఫ్యామిలీకి చెందిన నందమూరి చైతన్య కృష్ణ ఎంగేజ్మెంట్ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. 


ఈయన కూడా ఒక సినిమాలో నటించాడు 2003 సంవత్సరంలో జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ధమ్ అనే సినిమాలో ఈయన హీరోగా నటించాడు. అయితే ఈయనకు సినిమాలు కలిసి రాకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎట్టకేలకు ఆయనకు పెళ్లి సంబంధం కుదరడంతో నిన్న ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరుపుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. ఈ నిశ్చితార్థానికి నందమూరి బాలకృష్ణ, mokshagna TEJA' target='_blank' title='నందమూరి మోక్షజ్ఞ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నందమూరి మోక్షజ్ఞ తేజ, నందమూరి కళ్యాణ్ రామ్ లు హాజరయ్యారు. 


దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమ అభిమాన హీరో బాలకృష్ణ కొడుకు త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడు అని భావించిన బాలయ్య అభిమానులకు మాత్రం కాస్త షాకింగ్ అనిపించాయి. ఎందుకంటే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ బరువు తగ్గకుండా అలానే ఉన్నాడు. అంటే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. మొత్తంగా బాలయ్య మాత్రం తన ట్రెడిషినల్ లుక్ తో అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: