ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4షో 14వ వారం ఎండింగ్ కి చేరుకుంది. ఇక నేడు హౌస్ లో ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ అయిన అభిజిత్, మోనాల్, హారిక, సోహైల్, అరియానాలలో ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈవారం హౌస్ నుంచి మోనాల్ ఎలిమినేట్ అవనుందని అంటున్నారు. ఇక హౌస్ లో మొదటి నుంచి తనదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు మైండ్ గేమ్ తో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నాడు అభిజిత్.

ఇప్పటికే గడిచిన 14 వారాల్లో 11 వారాలకు పైగా ఎలిమినేషన్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భారీస్థాయి ఓటింగ్ దక్కించుకుని సేఫ్ గా బయటకు వస్తున్న అజిత్ కి ప్రతివారం విపరీతమైన ఓటింగ్స్ వస్తున్నాయని మరోవైపు ఆయనకు బయట ఎందరో అభిమానులు అలానే అభిమానుల నుండి మంచి మద్దతు లభిస్తోందని అంటున్నారు. ఇక అభిజీత్ కి సంబంధించి ఎటువంటి న్యూస్ అయినా సరే ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి.

అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల తన స్నేహితులతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ల కలయికలో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమా లోని కుంగ్ ఫు కుమారి సాంగ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి స్టెప్స్ తో అదరగొట్టాడు అభిజిత్. ఇక ఆ డాన్సింగ్ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండగా దానిని అభిజిత్ ఫ్యాన్స్ పలువురు మరింతగా షేర్స్, లైక్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ఇక అభిజిత్ ఈరోజు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం కూడా అందుతుంది. మరి ఈ విధంగానే దూసుకెళితే అతను ఫైనల్లో విజేతగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో అభిజీత్ నిజంగానే ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తాడో లేదో తెలియాలంటే మరొక వారం వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: