బాలక్రిష్ణ సీనియర్ ఎన్టీయర్ నట వారసుడిగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన సినిమా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ నాటౌట్ అంటూ ముందుకు సాగుతున్నాడు. మరి బాలయ్య వారసుడు ముచ్చట ఏదీ అంటూ ఏనాటి నుంచే ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. వారు అలా అడిగి అలసిపోయారు కూడా. నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ ఎంట్రీ ఇచ్చి కూడా నాలుగేళ్ళు దాటింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ అఖిల్ ఇద్దరూ ఒకే ఈడువారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇప్పటికీ ఒక సస్పెన్స్ గానే ఉంటోంది.

దీని మీద ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. పుకార్లు షికార్ చేశాయి కానీ మ్యాటర్ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయింది. ఇదిలా ఉంటే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తాజాగా తన అన్నయ్య పెళ్ళిలో కనిపించి కనువిందు చేశాడు. నందమూరి జయక్రిష్ణ కుమారుడు చైతన్య పెళ్ళి ఈ మధ్యన జరింది. ఆ పెళ్ళిలో మోక్షజ్ఞ అలా మెరిసిన ఫోటోలు ఇపుడు ఫ్యాన్స్ చూసి మళ్ళీ వారసుడి ఎంట్రీ మీద మోజు పెంచుకుంటున్నారు.

బాలయ్య ఇప్పటికీ నాటౌట్ అంటూ మరో అయిదారు సినిమాలు లైన్లో పెట్టేశారు. అదే సమయంలో కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మీద కూడా వార్తలు ఎక్కడా ఆగడంలేదు. బుర్రా సాయి మాధవ్ కధ రెడీ చేశారని రేపో మాపో లాంచింగ్ అంటూ కూడా ఆ మధ్య కధనాలు వచ్చాయి. ఇక బోయపాటి శ్రీను మోక్షజ్ఞను డైరెక్ట్ చేస్తాడని కూడా అన్నారు. అలాగే ఈ వరసలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఇపుడు మోక్షజ్ఞను చూసిన ఫ్యాన్స్ 2021లో నైనా ఎంట్రీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఎందుకంటే మంచి సమయం మించిన దొరకదు అని అంటారు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఫ్యాన్స్ ఆరాటం ఉంటే బాలయ్య మోక్షజ్ఞ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: