అల్లు అర్జున్ ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా షూటింగ్ అంతా అడవిలోనే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఈ సినిమా యూనిట్ కి టెన్షన్ గా మారింది. నిజానికి ముందుగా ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ అడవుల్లో చేయాలని సుకుమార్ భావించాడు. కానీ కరోనా టెన్షన్ మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ చేసింది. బ్యాంకాక్ కుదరకపోవడంతో దట్టంగా అడవులు ఉండే కేరళలో ఈ సినిమా షూటింగ్ జరపాలని భావించారు. కానీ భారత్ లో అన్ని రాష్ట్రాల కంటే కేరళలోనే ఈ కరోనా టెన్షన్ కాస్త ఎక్కువ ఉండడంతో అక్కడ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధ పడలేదు. 

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. అయితే అక్కడ షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ మెంబర్ కు ఒకరికి కరోనా సోకింది. అతను ఏకంగా కరోనా బారిన పడి చనిపోవడంతో ఈ సినిమా యూనిట్ ప్యాకప్ చెప్పేసి హైదరాబాదులో ఎవరి ఇళ్ళకు వారు వచ్చేసి ఐసోలేషన్ కి వెళ్ళారు. దాదాపు ఇది జరిగి 20 రోజులు కావస్తోంది.

దీంతో ఇప్పుడు మరలా షూటింగ్ మొదలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో ప్రత్యేకంగా సెట్లు వేసి చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా యూనిట్ అంతా మరలా మారేడుమిల్లి అడవులకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడే షూటింగ్ జరపడానికి ఈ సినిమా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త కరోనా వేరియంట్ కనుగొన్న క్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినా సరే అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడానికి ఈ సినిమా యూనిట్ రిస్కు చేస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: