కుమారి 21ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హెబ్భా పటేల్ ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీని వాడుకోలేకపోయింది. అయితే సినిమాలైతే చేస్తుంది కాని ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడంలో వెనకపడ్డది హెబ్భా పటేల్. ఇక ఈమధ్య చిన్న చిన్న పాత్రల్లో కూడా చేస్తున్న హెబ్భా పటేల్ రాం రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ప్రస్తుతం సంపత్ నంది నిర్మిస్తున్న ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో నటిస్తుంది హెబ్భా పటేల్. ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో కె.కె.రాధామోహన్ కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా హెబ్భా పటేల్ తన నెక్స్ట్ సినిమాలో డెఫ్ అండ్ డమ్ రోల్ లో కనిపించనుంది. నూతన దర్శకుడు విశ్వ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వినాయక్ దగ్గర అసోసియేట్ డైరక్టర్ గా చేసిన విశ్వ మెగా ఫోన్ పట్టుకుని సినిమా చేస్తున్నాడు.

అందరు హీరోయిన్స్ ప్రయోగాలు చేస్తుండగా హెబ్భా పటేల్ కూడా చెవిటి, మూగ పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. విశ్వ డైరక్షన్ లో పూర్తిగా కొత్త ప్రయోగం చేస్తున్న హెబ్భా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. గ్లామర్ తో పని జరగట్లేదని నటనతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంది హెబ్భా పటేల్. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించి మెప్పించిన హెబ్భా పటేల్ మరోసారి రాజ్ తరుణ్ తో జోడీ కడుతున్నట్టు తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: