కమల్ హాసన్, సరిత హీరో హీరోయిన్లగా నటించిన మరో చరిత్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను  ప్రముఖ దర్శకుడు బాల చందర్‌  తీశారు.  అయితే మరో చరిత్ర’ షూటింగ్ జరుపుకుంటున్న రోజులలో హీరోయిన్ సరితకు ఒక చేదు అనుభవం ఎదురైందట. ఏ సినిమాను షూటింగ్ చేసేందుకు చిత్రబృందం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లారట. అక్కడ చిత్రీకరించే సీన్ ఏంటంటే మన హీరో అయిన  కమల్‌హాసన్‌ హీరోయిన్ అయిన సరిత బొడ్డుపై బొంగరం తిప్పే సన్నివేశాన్ని షూట్ చేయాలి. అయితే అప్పట్లో ఎవరన్నా సినిమా వాళ్లు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తండోపదండలుగా వాళ్ళని చూడడానికి వచ్చేవాళ్ళు. అలాంటిది కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు వచ్చాడని తెలిస్తే అభిమానులు ఊరుకుంటారా..అందుకే  ఆయన్ని, ఆ సినిమా  చిత్రీకరణను  వీక్షించేందుకు ప్రజలు అక్కడకు వచ్చారట.

అయితే అక్కడకి  వచ్చిన వారిలో కొందరు హీరో కమల్ హాసన్ ను చూసి సంతోషపడ్డారట కానీ హీరోయిన్ సరితను చూసి మాత్రం పెదవి విరిచారట.  ‘ఏంటీ ఈమె హీరోయినా? చూడడానికి ఇంత నల్లగా ఉంది. అసలు హీరోయిన్ అంటే ఎలా ఉండాలి.. ఈమెని చూడడానికి అందంగా కూడా లేదు. కమల్‌ హాసన్ లాంటి అందగాడు ఈ నల్లపిల్లను  ప్రేమించాడంటే సినిమా చూసే  ప్రేక్షకులు నమ్మగలరా.. అని గుసగుసలాడారట షూటింగ్  సమయంలో. అయితే ఆ మాటలు అప్పటికి మాత్రమే పరిమితం అయ్యాయి. సినిమా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. తనను నల్లపిల్ల, అందంగా లేదు అన్నా నోళ్లే వెళ్ళబెట్టేలా సరిత నటించి చూపించింది. ఈ మాట అన్నవాళ్లే  మళ్లీ మళ్లీ వెళ్లి ఆ చిత్రం చూశారట.

ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడయితే సరితకు చేదు అనుభవం ఎదురైందో... ఆ ప్రాంతంలోనే ఓ థియేటర్‌లో మరోచరిత్ర సినిమా  శతదినోత్సవం జరుపుకుందట. ఇలా తనకు ఎదరు అయిన ఒక సందర్భాన్ని సరిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే సరిత చూడడానికి నల్లగా ఉంటుంది కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో విరిసిన ఒక "నల్ల కలువ" అని అప్పట్లో సరితను పిలిచేవారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ప్రస్తుతం సరిత సినిమాల్లో  నటించకపోయినా ఎంతోమంది హీరోయిన్స్ కి తన గాత్రాన్ని ఇచ్చి వాళ్ళకి డబ్బింగ్‌ చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: