ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. మన  భారతీయ సంగీతాన్ని మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చేసిన గొప్ప గాయకుడు. సాంప్రదాయ సంగీతం నుంచి పాశ్యాత్య సంగీతం వరకు అన్ని రకాల సంగీతాలనుఅలవోకగా   పలికించడంలో ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన సంగీతం అందిస్తున్నారంటే చాలు ఆ సినిమా మీద హైప్ మరింత పెరుగుతుంది. ఎన్నో గొప్ప గొప్ప పాటలను మనకి అందించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడం ఒక్క ఏ ఆర్ రెహమాన్‌కే మాత్రమే సాటి. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించాలన్నా ఆయనే. సరి కొత్త రికార్డులు తేవాలన్న ఆయనే. ఇక ఈయన గురించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.. !!  1967 వ సంవత్సరం జనవరి 6న  చెన్నైలో పుట్టాడు. అసలు మనం అందరం పిలిచే రెహమాన్ అనే పేరు కాకుండా ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది. రెహమాన్ మొదటి పేరు దిలీప్ కుమార్.ఆయన తండ్రి పేరు ఆర్.కె.శేఖర్. రెహమాన్ తండ్రి కూడా మ్యూజిక్ కంపోజర్ కావడం విశేషం. తమిళ్, మలయాళి చిత్రాలకు కంపోజ్ చేసేవాడు.అలా తండ్రితో పాటు రెహమాన్ కూడా రికార్డింగ్స్ కు వెళ్లేవాడు. అప్పుడే కీబోర్డ్ ప్లే చేయడం  నేర్చుకున్నాడు.

రెహమాన్ కు తొమ్మిది సంవత్సరాల  వయసున్నప్పుడు తండ్రి మరణించాడు. తల్లి కస్తూరి కుటుంబాన్ని పోషించేది. ఇంట్లో ఉన్న మ్యూజిక్  సామాగ్రిని అద్దెకు ఇచ్చి కొన్నాళ్లపాటు జీవనం సాగించారు. అప్పట్లో వాళ్ల కుటుంబంలో చెల్లెలికి  ఓ వింత రోగం వచ్చింది. ఎన్ని గుడి గోపురాలు తిరిగినా కానీ ఉపయోగం లేదు. అప్పుడు ఓ ముస్లిమ్స్ దర్గాలో ప్రార్ధనలు చేసిన తర్వాత చెల్లెలి  రోగం తగ్గితే తాను మతం మార్చుకుంటానని ప్రమాణం చేసాడట.అయితే ఆ  ప్రార్ధనల ఫలితమో లేక మరే కారణం చేతనో కానీ.. వాళ్ల చెల్లెలికి సోకిన ఆ మహామ్మారి రోగం తగ్గిపోయింది. చేసిన ప్రమాణం ప్రకారం 1989లో ఫ్యామిలీతో పాటు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు రెహమాన్. అనుకున్న వెంటనే చెల్లెలి ఆరోగ్యం కుదుటపడడంతో ఇస్లాంపై విశ్వాసం పెరిగింది. అలాగే కుటుంబంలోని అందరి పేర్లు మారిపోయాయి. దిలీప్ కుమార్ పేరు కాస్త.. అల్లా రఖా రెహమాన్ గా మారిపోయింది.ఇన్నాళ్లు కంటికి రెప్పలా చూసుకున్న తన తల్లి కన్నుమూయడం ఆయన జీవితంలో తీరని లోటు. పేరు మార్చుకోవడంతో పాటు మతం కూడా మారాడు. మాములుగా ముస్లిమ్స్‌ ఇంటి పేర్లు చూస్తే  మహమ్మద్ అని, సైయద్,  పఠాన్ అని, ఖాన్ అని, షేక్ అని ఉంటాయి. కానీ రెహమాన్ మాత్రం ఆ దేవుడు తన పేరు అల్లా రఖా పెట్టినట్టు ఎన్నోఇంటర్వ్యూల్లో వెల్లడించాడు.రోజా సినిమాతో తన సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఏ.ఆర్.రెహమాన్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే తెలుగులో మరి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించాడు. వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్, మెగాస్టార్ నటించిన గ్యాంగ్ మాస్టర్, అలాగే నాని,నీ మనసు నాకు తెలుసు, ఏమాయచేసావే, కొమరం పులి, ఇలా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. అలాగే మరికొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: