టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తమ తండ్రుల వారసత్వాన్ని వాళ్ళు అంతా కొనసాగిస్తున్నారు. చిరంజీవి, హరికృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, సాయి కుమార్, నాగబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ప్రముఖు యాక్టర్ల కుమారులు తెరంగేట్రం చేసి తమ అభిమానులను బాగా అలరిస్తున్నారు. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లో రంగప్రవేశం చేయలేదు.

బాలకృష్ణ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని నందమూరి అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కి ఫిట్ నెస్ లేదు కాబట్టి సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఫారెన్ వెళ్లి దేహదారుఢ్యం పెంచుకోవడానికి నిపుణుల శిక్షణలో వ్యాయామం చేస్తున్నారు. మోక్షజ్ఞ కు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని.. కేవలం బాలకృష్ణ కోరిక మేరకే ఆయన సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారనే వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా మోక్షజ్ఞ త్వరలోనే సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ తనకు సంబంధించిన కొత్త లుక్ ని త్వరలోనే రిలీజ్ చేస్తానని ప్రకటించారట. గత ఏడాదిలో విదేశాలకు వెళ్లిన మోక్షజ్ఞ ఎలా బాడీ బిల్డ్ చేశారో ఈ లుక్ లో కనిపించబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నందమూరి ఫ్యామిలీ లో జరిగిన ఒక వెడ్డింగ్ ఫంక్షన్ లో మోక్షజ్ఞ కనిపించారు. అయితే ఈ ఫంక్షన్ లో మోక్షజ్ఞ కాస్త బొద్దుగానే కనిపించారు. కానీ నందమూరి అభిమానుల కోసం కండలు పెంచి త్వరలోనే తన ఫోటోని విడుదల చేయాలని మోక్షజ్ఞ దృఢంగా నిశ్చయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ నుంచి మొదటిసారిగా ఒక మంచి శుభవార్త వింటున్నానని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: