టాలీవుడ్ కి సంక్రాంతి పెద్ద సీజన్. ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు ఈ సీజన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్నాక ఈ ఏడాది కూడా మూడు డైరెక్ట్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లోనూ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఒక్కటే సంక్రాంతి విన్నర్ గా నిలబడింది. ఇక ఈ సీజన్ పూర్తవడంతో సమ్మర్ దాకా సినిమాలు రిలీజ్ కష్టమే అని భావించారు. కానీ ఏడాది పాటు ధియేటర్స్ లేకపోవడంతో అప్పటి నుంచి తెరకెక్కి సిద్ధంగా ఉన్న సినిమాలు, లాక్ డౌన్ సమయంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ కి క్యూ కడుతున్నాయి. ఇక ఈ ఏడాది శివరాత్రికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. 

ఆ మూడు సినిమాలు ఏమంటే జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్. ఈ మూడు సినిమాలు మార్చి నెల 11వ తేదీన రిలీజ్ కానున్నాయి. శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీకారం సినిమా రిలీజ్ డేట్ రెండు రోజుల క్రితమే ఫిక్స్ చేశారు. ఇక నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన జాతిరత్నాలు సినిమా అలాగే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న గాలి సంపత్ సినిమా రిలీజ్ డేట్ లు నిన్ననే అనౌన్స్ చేశారు. నిజానికి ఈ మూడు సినిమాలు దాదాపుగా ఒకే బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు. వీటిని అటు హై బడ్జెట్ సినిమా అని, ఇటు లో బడ్జెట్ సినిమా అనలేము. 

ఈ మూడు సినిమాలు ఒకే రోజు థియేటర్స్ లోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న శ్రీకారం సినిమాని కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కథను ఒక షార్ట్ ఫిలిం నుంచి డెవలప్ చేశారని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న గాలి సంపత్ అనే సినిమాని అనీష్ కృష్ణ తెరకెక్కించగా దీనికి అనిల్ రావిపూడి కథ స్క్రీన్ ప్లే అందించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.  ఇక నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటించిన జాతి రత్నాలు సినిమాని నాగ్ అశ్విన్ నిర్మించగా అనుదీప్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: