కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు అన్ని త్వరగా షూటింగ్స్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక 2021 సంవత్సరం ప్రారంభంలోనే క్రాక్ సినిమాతో భారీగా వసూలు రాబట్టింది. ఇక ఈ ఏడాది దాదాపు 30 నుంచి 40 భారీ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. లెక్కలేసుకుంటే ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతీవారం కనీసం ఓ క్రేజీ సినిమా విడుదల కానుంది.

ఇక సీజన్.. అన్ సీజన్ అనే తేడా లేకుండా అన్ని నెలల్లోనూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు మే 2021 మాత్రం చాలా ప్రత్యేకంగా మారిపోయింది అభిమానులకు. ముఖ్యంగా ఇండస్ట్రీ కూడా ఈ ఒక్క నెల గురించి మాట్లాడుకుంటుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మేలో కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ముగ్గురు సీనియర్ హీరోల సినిమాలు ఒకే నెలలో వస్తున్నాయి.

అయితే దాదాపు 20 ఏళ్లైపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే నెలలో వస్తున్నారు. చిరంజీవి ఆచార్య.. వెంకటేష్ నారప్ప..బాలయ్య బిబి 3 సినిమాలు మే నెలలో విడుదల కానున్నాయి. 13న చిరంజీవి ఆచార్య విడుదల కానుంది. ఆ మరుసటి రోజు మే 14న నారప్ప వస్తుంది. అదే నెల చివర్లో మే 28న ఎన్టీఆర్ జయంతి రోజు బోయపాటి సినిమాతో వస్తున్నాడు బాలయ్య. అలా ఒకే నెలలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా ఒకేసారి ముగ్గురు సీనియర్ హీరోల సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది.

ఇక అప్పుడెప్పుడో 2001 సంక్రాంతికి బాలయ్య నటించిన నరసింహనాయుడు, వెంకటేష్ దేవీ పుత్రుడు, చిరంజీవి మృగరాజు వచ్చాయి. ఆ తర్వాత ఒకే నెలలో..ఒకేసారి ఈ ముగ్గురు సీనియర్ హీరోలు కలిసి రాలేదు. ఆ తర్వాత బాలయ్య, చిరంజీవి కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు కానీ వెంకటేష్ రాలేదు. కానీ ఈసారి మాత్రం మే నెలలో ఈ చిత్రం చూడబోతున్నారు అభిమానులు. ఒకే నెలలో 15 రోజుల గ్యాప్‌లో మూడు భారీ సినిమాలు.. ముగ్గురు సీనియర్ హీరోలు రాబోతున్నారు. దాంతో మెగా, నందమూరి, దగ్గుబాటి అభిమానులు కంబైండ్‌గా పండగ చేసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: