మన టీమిండియా క్రికెటర్లు కొందరు సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోతున్నారు.. ఈ నేపథ్యంలోనే టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కి సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది..అది కూడా తన సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తో కలిసి డ్యాన్స్ చేయడం గమనార్హం.. 'రోజస్' అనే పాటకు వీరిద్దరూ డ్యాన్స్ వేయడం గమనార్హం. కాగా.. ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియోని అయ్యర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..

 ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్‌లు సాధించిన ఈ వీడియోను టీమిండియా ఆటగాళ్లు చాహల్‌, లోకేశ్‌ రాహుల్‌, మయాం‍క్‌ అగర్వాల్‌, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు తెగ మెచ్చుకున్నారు. వీరిద్దరి డ్యాన్స్‌ మూమెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.ముఖ్యంగా వీడియోలో ధనశ్రీ హావభావలకు నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఓ ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తారు.ఇదివరకే యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ధనశ్రీ.. తాజా వీడియోతో మరింత పాపులారిటిని సొంతం చేసుకుంది. కాగా, ధనశ్రీ వర్మను చాహల్‌ గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఓ పక్క ధనశ్రీ యూట్యూబ్‌ వేదికగా డ్యాన్స్‌లతో అదరగొడుతుంటే, మరో పక్క చాహల్‌ తన మణికట్టు మాయాజాలంతో టీమిండియాకు మరపురాని విజయాలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.అంతేకాకుండా ఈ మధ్య చాహల్‌ కూడా తన పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి.. పలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు...ప్రస్తుతం చహల్ భార్యతో కలిసి స్టెప్పులేసిన శ్రేయస్ అయ్యర్ డ్యాన్స్ వీడియో మాత్రం నెటీజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!




మరింత సమాచారం తెలుసుకోండి: