ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చి అవకాశాల్లేక కొంతమంది తిరిగి ఇంటి ముఖం పడుతుంటే మరి కొంతమంది ఇంటికి వెళ్లలేక ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటూ బ్రతుకు బండి ని కొనసాగిస్తున్నారు. ఇంటికి తిరిగి వెళ్లే మొహం లేక చెడ్డదారులు తొక్కుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డబ్బు సంపాదన కోసం చివరికి తమ శరీరాన్ని కూడా అమ్ముకుంటున్నారు.. అలా టాలీవుడ్ లో ఇలాంటి సందర్భాలు ఎదుర్కున్న హీరోయిన్ లు చాలామంది ఉన్నాయి.. సైరా భాను, శ్వేతా బసు ప్రసాద్ లాంటి వాళ్ళు కెరీర్ సరిగ్గా లేక, చేతిలో డబ్బులు లేక ఈ దారిని ఎంచుకున్నవారే..

ఇప్పుడు ఎలా ఉన్నా వారు మాత్రం ఈ వివాదాలతో ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు.. ఇక ఇటీవలే నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన గెహెనా ఈ వివాదంతోనే వార్తల్లో నిలిచింది..  నీలి చిత్రాలను చిత్రీకరించి, ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి సబ్‌స్ర్కిప్షన్‌ ఫీజు కింద వీక్షకుల నుంచి ఆమె రూ. 2000లను వసూలు చేస్తున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడమే కాకుండా, సుమారు 87 నీలిచిత్రాలు వెబ్‌ సైట్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్న నటీమణులకు ఒక్కో చిత్రానికి రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఇచ్చేట్లుగా ఓ డీల్‌ కుదుర్చుకుని.. వారితో గెహనా నీలి చిత్రాలను చిత్రీకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తుందని, ఆమె బ్యాంక్‌ అకౌంట్స్‌ మూడింటిలో రూ. 36 లక్షలు ఇలా సబ్‌స్ర్కిప్షన్‌ కింద వచ్చినవే ఉన్నాయని వారు తెలిపారు. ఫిల్మ్‌ షూటింగ్‌ ముసుగులో మలద్‌లోని మద్‌ ఐలాండ్‌లో కొంతమంది నటులతో బలవంతంగా ఈ అశ్లీల చిత్రాలను చిత్రకరణ చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఫిబ్రవరి 5న ఆ ప్రాంతంలో రైడ్‌ చేయగా ఇటువంటి కార్యకలాపాలు జరుపుతున్న ఓ ముఠా గురించి తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముఠా నుంచి ఇద్దరు బాలికలను రక్షించి పునరావాస కేంద్రానికి పంపినట్లుగా కూడా తెలిపారు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. గెహనా నుంచి పోలీసులు రాబడుతున్న సమాచారంతో బాలీవుడ్‌లో వాతావరణం మరోసారి వేడెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: