లేటెస్ట్ గా విడుదలైన ‘చెక్’ మూవీ సగటు ప్రేక్షకుడి అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ఈ మూవీ ద్వారా కమర్షియల్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మారాలి అనుకున్న చంద్ర శేఖర్ ఏలేటి ఆశలు కూడ నెరవేరే పరిస్థితి కనపడటం లేదు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ చూసిన ప్రేక్షకులు మాత్రం కొంత షాక్ కు గురవుతున్నారు.


ఈ క్లైమాక్స్ ను బట్టి ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని నితిన్ ఒక ఇంటర్వ్యూలో ఆమధ్య చెప్పాడు. అంతేకాదు ఈమూవీ కథ సీక్వెల్ కు పూర్తిగా సరిపోతుందని నితిన్ గుంభనంగా చెప్పినప్పటికీ ఆ విషయానికి పెద్దగా ఎవరు ప్రాముఖ్యత ఇవ్వలేదు.


అయితే ఈ మూవీ క్లైమాక్స్ చూసిన తరువాత ఈ మూవీ పై విశ్లేషణలు చేసే విశ్లేషకులు మాత్రం ఈమూవీ కథ సీక్వెల్ సరిపోతుంది అని చెపుతున్నారు. వాస్తవానికి చంద్ర శేఖర్ ఏలేటి ఈ సీక్వెల్ ను దృష్టిలో పెట్టుకుని ఈమూవీ క్లైమాక్స్ వ్రాసాడని టాక్. అయితే ఈమూవీకి వచ్చిన ఫలితం రీత్యా ఇక ఈ సీక్వెల్ ఆలోచనలు ఉండకపోవచ్చు. కొన్ని వారాల క్రితం విడుదలైన ‘జాంబిరెడ్డి’ మూవీకి కూడ సీక్వెల్ ఉండవచ్చు అన్న సందేహం ఆమూవీ క్లైమాక్స్ చూసిన వారికి కలిగింది. అయితే ఆమూవీ కూడ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో ఆ సీక్వెల్ ఆలోచన అటకెక్కింది.


ఒక సినిమా కథకు ఊహించని ట్విస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనలతో అనేకమంది కథ క్లైమాక్స్ లో చేస్తున్న రకరకాల ప్రయోగాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాయి అన్నది నిజం. సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఏలేటి స్థాయిలో ‘చెక్’ మూవీ లేదు అంటూ విమర్శకులు కూడ విశ్లేషణలు చేస్తున్నారు. దీనితో వస్తున్న ఈ నెగిటివ్ కామెంట్స్ ఈ దర్శకుడుకి షాక్ అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: