తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదట్లో విలన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత సుప్రీం హీరోగా.. సూపర్ స్టార్ గా.. ఆ తరువాత మెగాస్టార్ గా ఫ్యాన్స్ నుంచి బిరుదు తెచ్చుకున్నారు చిరంజీవి..ఇదిలా ఉంటె చిరూ నటించిన కొదమసింహం సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి.. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. సంఘర్షణ సినిమా తరువాత చిరంజీవి, మురళీమోహన్ రావు కాంబినేషన్లో వీరి కలయికలో వచ్చిన చిత్రం కొదమ సింహం. ఆ తరువాత కథ కోసం పలు హాలీవుడ్ సినిమాలను చూశారు మురళీమోహన్ రావు. చివరికి అన్నీ కలిసి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా సినిమాను తయారు చేశారు.

నాగేశ్వర్ రావు, విజయేంద్రప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ కలిసి కొదమ సింహం కథను తయారు చేశారు. కౌభాయ్ సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు దేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా కథను తయారు చేశారు. అయితే నిర్మాత నాగేశ్వర్ రావు ఈ సినిమా మిగతా వాటికంటే భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా కొన్ని సీన్స్ తీయించారు. సినిమాకు అవసరమయ్యే కాస్ట్యూమ్స్ , డ్రెస్సింగ్ ఇతర వాటిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు.అలాగే మద్రాస్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగల్ పద్దిలో ప్రత్యేకంగా సెట్ వేశారు.

ఇక్కడ కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే తీశారు. అలాగే మద్రాస్, ఊటీ, తలకోన, కడబోగి మహన్, మైసూర్ , బెంగళూర్, కొచ్చి, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుపుకుంది. అప్పట్లో ఈ సినిమాకు రూ.4 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయాలంటే 100 కోట్లు కావాలి. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నదియా అనుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు వివాహం అయింది. అయినా ఆమెను నాగేశ్వర్ రావు సంప్రదించడంతో ఒప్పుకుంది. అయితే చిరంజీవి డేట్స్ కారణంగా ఆమె స్థానంలో హిందీ నటి సోనమ్ ను పెట్టారు..మొత్తానికి ఈ సినిమా వెనక ఇంత పెద్ద కథ నడిచిందన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: