పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మంచి ఎమోషనల్ కథలతో సినిమాలు తీయగల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామా మూవీ గా మొఘలుల కాలం నాటి కథగా ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నాయిక జాక్వలీన్ ఫెర్నాండేజ్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆకట్టుకునే కథ, కథనాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి ఒక చిన్న ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే నేడు మహాశివరాత్రి పండుగ ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం ఈ మూవీ అఫీషియల్ టైటిల్ ని అనౌన్స్ చేసింది యూనిట్. 

హరి హర వీరమల్లు గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ పేరు వీరమల్లు అని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ నిడివి తక్కువే అయినప్పటికీ అందులో పవర్ స్టార్ తన యాక్షన్ తో అదరగొట్టగా కీరవాణి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మొత్తంగా హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీ ని సంక్రాంతి పండుగ కానుకగా 2022 జనవరి లో రిలీజ్ చేయనుంది యూనిట్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: