ఎవరు మరిచిపోయినా ఫర్వాలేదు... ఎవరు వదిలేసినా ఫర్వాలేదు... విజయం సాధించకపోయినా ఫర్వాలేదు... నా పని నేను చేసుకుపోతాను అనే ధోరణిలో ఉన్నాడు ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ప్రస్తుతం జైశ్రీరామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఉదయ్ కిరణ్ ఓ పాటలో విచిత్రమైన పాత్రలో కనిపించనున్నాడు. అదేంటో కాదు... పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలో జానీ డెప్ పోషించిన పాత్ర గెటప్. ఇందులో ఉదయ్... అచ్చం జానీ డెప్ లానే ఉన్నాడు అంటున్నారు చూసిన వాళ్లంతా. మరి, ఆ సినిమా భారీ హిట్టయి కలెక్సన్ల వర్షం కురిపించింది. మరి, మనోడి సినిమా ఏ వర్షం కురిపిస్తుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: