టాలీవుడ్ యంగ్ శర్వానంద్ మంచి మంచి సినిమాలు చేసి మంచి కుటుంబ కథా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు."రన్ రాజా రన్ ", శతమానం భవతి ", "మహానుభావుడు" వంటి సినిమాలతో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా వరుస ప్లాపులు ఎదురుకుంటున్న శర్వానంద్ తాజాగా నటించిన సినిమా "శ్రీకారం". ఈ సినిమాలో నాని సినిమా "గ్యాంగ్ లీడర్ " సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా అరుళ్ మోహన్ శర్వానంద్ కి జంటగా నటించింది.కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెద్దగా నమోదు కావడం లేదు. మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ తరువాత నుండీ బాగా డల్ అయ్యాయి.సినిమా కథ కొత్తగా లేకపోవడం పైగా ఈ సినిమాకి పోటీగా "జాతి రత్నాలు" లాంటి బ్లాక్ బస్టర్ ఉండటంతో ఈ సినిమాకి వచ్చే జనాలు తక్కువయ్యారు..



ఇక '14 రీల్స్ ప్లస్‌' బ్యానర్ పై రామ్ ఆచంట,గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా 5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే....'శ్రీకారం' చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.69 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 8.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మరి ఈ సినిమా అంత మొత్తం రాబడుతుందో లేదో చూడాలి. ఇక చూస్తుంటే ఈ సినిమా అంత మొత్తం వసూలు చెయ్యడం కష్టంగా కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: