
అయితే 1994లో ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన టాలీవుడ్, బాలీవుడ్ నటి జయప్రద 1996లో రాజ్యసభకు ఎన్నికైంది. తర్వాత ఆపార్టీ నుంచి తప్పుకుని యుపిలో సమాజ్ వాదీ పార్టీలో చేరి, 2004లో రామ్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికైంది. 2019లో బిజెపి గూటికి చేరింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 1998లో బీజేపీలో చేరి, తర్వాత బయటకు వచ్చి, తల్లి తెలంగాణ పేరిట పార్టీ పెట్టింది. తర్వాత టీఆరెస్ లో తన పార్టీని విలీనం చేసి, ఎంపీగా మెదక్ నుంచి గెలిచింది. తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఈమె ఇటీవల మళ్ళీ బిజెపి గూటికి చేరింది.
ఇక తెలుగు, తమిళంలో స్టార్ హోదా తెచ్చుకున్న నగ్మా 2014లో కాంగ్రెస్ తరపున మీరట్ నుంచి పోటీచేసి ఓడిపోయింది. నటి నవనీత్ కౌర్ మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ తరపున ఎంపీగా2014లో పోటీచేసి ఓడిపోయి, 2019లో గెలిచింది. సీనియర్ నటి సుమలత కర్ణాటక మండ్య లోక్ సభ నుంచి పోటీ చేసి, గెలిచింది. సహజనటి జయసుధ 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా స్వతంత్రంగా పోటీచేసి గెలిచింది. తర్వాత టిడిపిలో చేరి, తాజాగా వైసిపిలో చేరింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా 1999లో టిడిపిలో చేరింది. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందిన ఈమె వైస్సార్ సిపిలో చేరి, 20014లో నగరి నుంచి గెలిచి, 2019లో మరోసారి నగరి నుంచి గెలిచింది.