బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా తారా స్థాయికి వెళ్లి పోయిందనే విషయం తెలిసిందే. ఇక అక్కడి నుంచి భారీ స్థాయిలో క్రేజ్ పాపులారిటీ తో పాటు మార్కెట్ ని కూడా పెంచుకున్న ప్రభాస్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ మూవీ జూలై 30న రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరాం తదితరులు నటిస్తున్నారు. మంచి ఎమోషనల్ లవ్ కం రొమాంటిక్ డ్రామా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుందట. అలానే దీనితో పాటు ప్రభాస్ రాముడిగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణుడు గా నటిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్ర చేస్తున్న ఈ సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అలానే దీనితోపాటు కే జి ఎఫ్ మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీలో కూడా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 రిలీజ్ చేయనుంది యూనిట్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిల్మ్స్ వారు దీనిని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల తర్వాత అతిత్వరలో మహానటి మూవీ ఫిలిం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్ లో రూపొందనున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ ఒక కీలక పాత్ర చేయనున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ యొక్క బడ్జెట్ దాదాపుగా రు .700 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని యూనిట్ స్టార్ట్ చేసిందని బడ్జెట్ పరంగా అలానే టెక్నికల్ వాల్యూస్ పరంగా దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీనిని తెరకెక్కించనున్నారని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభాస్ కెరీర్ లోనే కాదు యావత్ ఇండియన్ మూవీ హిస్టరీ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదని చెప్తున్నారు. మరి రేపు రిలీజ్ తర్వాత ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: