
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 వరకు థియేటర్స్ లో విడుదలై భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులకు క్రియేట్ చేస్తూ.. దూసుకెళుతోంది. మహిళలు మెచ్చిన ఈ సినిమా విజయోత్సవాన్ని 'మగువా ఇది నీ విజయం' పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వివిధ రంగాల్లో పేరు పొందిన మహిళలు పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు అండ్ ఎంటైర్ టీమ్‌కు వకీల్ సాబ్ సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్. వకీల్ సాబ్ సినిమాను నేను ఇక్కడ పొగడాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. ఒకరు మరో పది మందికి చెబుతారు. నేను పవన్ గారిని ఒకేసారి కలిశాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అలా మొదలైంది రిలీజ్ అయ్యాక, పవన్ గారిని విదేశాల్లో ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా కలిశాను. ఒక కామన్ ఫ్రెండ్ పవన్ గారు ఇక్కడే ఉన్నారని చెబితే భయం భయంగా వెళ్లి కలిశాను. ఆయన ఎంత మర్యాదగా మాట్లాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒక సినిమా చేసిన దర్శకురాలిని మాత్రమే. కానీ ఎంతో గౌరవం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్‌గారు తప్పితే మిగతా వారంతా పవన్ కళ్యాణ్ గారిలా ప్రవర్తిస్తుంటారని నేను ఫ్రెండ్స్ తో చెబుతుంటాను. ఆయన ఎంత సాదాసీదాగా ఉంటారో చూస్తే తెలుస్తుంది. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వకీల్ సాబ్ సినిమా పవన్‌గారు చేస్తున్నారంటే చాలా సంతోషించాను. ఇలాంటి సినిమా పెద్ద స్టార్ చేస్తే ఎంత రీచ్ అవుతుందో తెలుసు. వేణు డైరెక్ట్ చేస్తున్నాడంటే ఇంకా ఆనందించాను. ఆయనే కరెక్ట్ ఈ కథను డైరెక్ట్ చేయడానికి అనుకున్నా. వేణు కూడా మహిళలను చాలా గౌరవిస్తాడు. చాలా మందిని ఇన్ స్ఫైర్ చేసే కథ ఇది. ఇలాంటి కథాంశం దొరకడం అరుదు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతంగా తెరకెక్కించారు. కథ ఎక్కడా దారి తప్పకుండా కమర్షియల్ అంశాలు చేర్చుతూ శ్రీరామ్ వేణు సూపర్బ్ గా చూపించారు. వేణు లాంటి దర్శకుడికి కమర్షియల్ హిట్ రావాలి. థమన్ ఇంటర్వ్వూలు చూశాను. నేను చేసిన మ్యూజిక్ సరిపోలేదు అని ఆయన చెప్పడం సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో చెబుతుంది. ఉగాది పండగ టైమ్ ఇది. థియేటర్లోనూ పండగ వాతావరణ నెలకొంది. వకీల్ సాబ్ చిత్రాన్ని మరింత పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.