టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విలక్షణమైన స్టోరీ లు ఎంచుకుంటూ హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నటుడిగా ఒక్కో సినిమాతో మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్నారు యువ హీరో శర్వానంద్. ఇక తొలిసారిగా ఐదవ తారీఖు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శర్వా, ఆ తరువాత యువసేన, గౌరీ, వెన్నెల, అమ్మ చెప్పింది, లక్ష్మి ఇలా పలు సినిమాల్లో నటిస్తూ కొనసాగారు.

అయితే 2008లో క్రిష్ దర్శకత్వంలో మరొక నటుడు అల్లరి నరేష్ తో కలిసి శర్వానంద్ నటించిన గమ్యం సినిమా గొప్ప విజయాన్ని అందుకుని శర్వానంద్ కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి చాలావరకు మంచి ఛాన్స్ లతో కొనసాగిన శర్వా, ఆపై కెరీర్ పరంగా బాగా పేరుని విజయాలను అందుకున్నారు. ఇటీవల 2017లో మారుతీ తీసిన మహానుభావుడు మూవీ తో మరొక సూపర్ హిట్ కొట్టిన శర్వా, ఆపై వచ్చిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ లు అందుకోలేకపోయారు. అయితే ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శ్రీకారం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

రైతుల సమస్యలు అలానే వ్యవసాయం యొక్క ఆవశ్యతను గురించి అద్భుతమైన కాన్సెప్ట్ తో మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అవుతుందని యూనిట్ భావించిందట. అయితే సినిమా యొక్క కథ, బాగున్నప్పటికీ అక్కడక్కడా కథనంలో కొద్దిపాటి లోపాల వలన శ్రీకారం ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయిందని, అయితే దీనికి అవార్డులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు. మొత్తంగా శర్వానంద్ నుండి ఇటీవల మంచి అంచనాలతో వచ్చిన శ్రీకారం ఫ్లాప్ అవ్వడంతో తదుపరి ఆయన చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం సినిమాలపై ఆయన ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి అవి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: