ఒకప్పుడు కన్నడ సినిమలకు అక్కడ తప్ప మరో చోట మార్కెట్ ఉండేది కాదు. కానీ ఒక్క దెబ్బకు ఆ లెక్కలు మార్చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ అనే సినిమాని తెరకెక్కించిన ఆయన కన్నడ సినిమా సత్తాను ప్రపంచం అంతా చాటాడు. సౌత్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్’ మూవీకి సీక్వెల్‌గా ‘కె.జి.యఫ్ 2’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా లెవల్ సినిమాని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

 రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ లాంటి నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి భాగంలో కీలక పాత్రలో నటించిన ఒక నటుడికి కరోనా సోకిందట. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనే పవర్ఫుల్ పాత్రను బాలకృష్ణ అనే కొత్త నటుడు పోషించిన సంగతి తెలిసిందే. 

ఆయనకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ వెల్లడించారు. విషయం ఏమిటంటే ఆయన ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. అయితే బాలకృష్ణ, ఆయన భార్య ఉమా పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో వారిని హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. ఈ మేరకు ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ప్రశాంత్ నీల్ ఈ కుటుంబానికి బంధువు కావడంతో నటనకు ఏమాత్రం సంబంధం లేని బాలకృష్ణతో కేజీఎఫ్ లో ఇనాయత్ ఖలీల్ లాంటి ఒక పవర్ఫుల్ పాత్ర చేయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: