చిన్న తరం హీరోలలో హిట్ కోసం తెగ ఆతృత పడుతున్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. 2017లో శతమానం భవతి, ఆ తర్వాత మహానుభావుడు లాంటి హిట్ సినిమాల వచ్చినప్పటికీ  శర్వానంద్ ఖాతాలో మాత్రం  పడలేదు. శర్వానంద్, సాయి పల్లవి నటించిన సినిమా"పడిపడిలేచే మనసు" . ఈ సినిమా పై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ చేయగా, ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాగే రణరంగం, జాను సినిమాలు కూడా  శర్వానంద్ ని సంతృప్తి పరచలేకపోయాయి. ఈ సినిమాలు సంగతి పక్కన పెడితే  శర్వానంద్ నటించిన ఒక సినిమా మాత్రం ఇక్కడ ఫ్లాపు.. అక్కడ హిట్ అయింది. అయితే ఆ సినిమా ఏదో ఒక సారి చూద్దాం.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అంచట , గోపీ అంచట లు కలిసి నిర్మించిన చిత్రం"శ్రీకారం". ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ , హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించాడు. ఇందులో సీనియర్ నరేష్, సాయికుమార్,రావు రమేష్, తదితరులు ప్రముఖ  పాత్రల్లో  నటించి, ఈ సినిమా కు హైలెట్ గా నిలిచారు. ఈ సినిమా ఇదే సంవత్సరం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా శర్వానంద్సినిమా పట్ల అంత ఉత్సాహంగా లేడు అని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.


అయితే ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదలవ్వగా, అక్కడ మాత్రం  ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తోందని సమాచారం. సన్ ఎక్స్ట్రీమ్ లో తక్కువ సమయం లోనే అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శ్రీకారం సినిమా నిలిచింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ,  ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ ప్రాధాన్యతను తెలియజేసే సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం  బాగా ఆకర్షిస్తోంది అని దర్శకుడు బి కిషోర్ రెడ్డి తెలియజేశారు. ఏది ఏమైనా శర్వానంద్ సినిమా థియేటర్ల లో రాణించలేకపోయినా ఓటీటీలో మాత్రం బాగా రానిస్తోందనే  చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: