చంద్ర మోహన్ ఒకప్పటి హీరో తర్వాత కామెడీ హీరో ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్. ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

 చంద్ర మోహన్ స్పెషాలిటీ ఏమిటంటే అప్పట్లో  ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ గారిది.అయితే మొన్న ఆయన 76వ పుట్టినరోజున జరిగిన ఒక ఇంటర్వ్యూ తో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే దీనిని కొంతమంది అదునుగా తీసుకొని ఆయన ఆరోగ్యం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్వయంగా చంద్ర మోహన్ గారే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

" నా పుట్టినరోజు న చాలామంది  అభిమానులు అభినందనలు తెలిపారు వాళ్లందరికీ నా ధన్యవాదాలు, అయితే ఈ మధ్య నా ఆరోగ్యం మీద చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి అవి ఏవి నిజం కాదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీ ఆదరాభిమానాలకి కృతఙ్ఞతలు అని " చంద్ర మోహన్ గారు చిన్న వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.అయితే ఈ ఫేక్ న్యూస్ లకి కారణం మాత్రం ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రాఖీ సినిమా చేసిన తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో అనారోగ్యంతో షూటింగ వాయిదా వేశాను" అని అన్నారు. దీనితో ఆయనకి ఆరోగ్యం బాలేదు అని న్యూస్ అంత బయటకి వచ్చింది. అయితే ఈ వీడియోతో అన్న వాటికి చెక్ పడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: