శర్వానంద్ నటించిన జాను చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన నటి గౌరీ కిషన్ తాను లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నా అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ప్రముఖ పాఠశాలకు చెందిన కీచక టీచర్ ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్థినిలకు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు వచ్చిన వార్త సంచలనం రేకెత్తించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కీచక టీచర్ ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని సినిమాల్లో బాలనటిగా నటించిన గౌరీ కిషన్ కూడా స్పందించింది.

తమిళంలో 96 , మాస్టర్ , కర్ణన్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌరీ కిషన్. తాను కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు బాంబు పేల్చింది. అయితే ఆ స్కూలు పేరు తో పాటు వేధించిన ఉపాధ్యాయుడి పేర్లను మాత్రం వెల్లడించనని చెప్పింది. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ నేను మాత్రమే కాదు నా స్నేహితులకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. అడయారు లోని ఓ పాఠశాలలో చదువుకునే రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు. ముఖ్యంగా కులం పేరుతో దూషించడం, విద్యార్థినుల శరీరాకృతి గురించి నీచంగా కామెంట్ చేయడం ఇలా అనేక అంశాలపై సభ్యత లేకుండా మాట్లాడేవారు అని తెలిపింది.

ఇలా ప్రవర్తించిన ఉపాధ్యాయుల పేర్లు ఇప్పుడు వెల్లడించడం భావ్యం కాదు. అదే సమయంలో మనకు జరిగిన ఇలాంటి సంఘటనల గురించి బహిర్గతం చేస్తే కొంత మేరకు అవగాహన ఏర్పడుతుంది. వచ్చే జనరేషన్ కు చెందిన విద్యార్థులకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకూడదని అభిమతమని వెల్లడించింది. ఆమె సినిమా కెరియర్ కి వస్తే ప్రస్తుతం కొన్ని సినిమా అవకాశాలు సంపాదించుకొని హీరోయిన్ గా రోజుకి ఎదిగిపోతుంది గౌరీ కిషన్. అందం అభినయంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుని మరిన్ని సినిమా అవకాశాలు పొందాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: