సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అవినీతి తో నిండిపోయిన వ్యవస్థను మార్చే విధంగా దేవకట్టా రూపొందించిన ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.గతంలో మంచి మంచి పొలిటికల్ చిత్రాలను అందించిన దేవా కట్టాసినిమా ను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడట.

మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా. ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో హిట్ కొట్టిన సాయిధరమ్ రిపబ్లిక్ తో కూడా హిట్ కొడతాడని ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా సాయి ధరమ్ తేజ్ గత సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా లాగా ఓటీటీ లో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే ఓ టీ టీ లో రిలీజ్ అయింది. ఇప్పుడు రిపబ్లిక్ కూడా ఓటీటీ ల్లో రిలీజ్ అవబోతుందట.

రిపబ్లిక్ చిత్రం నిర్మాతలతో జీ నెట్వర్క్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జీ నెట్వర్క్ రిపబ్లిక్ చిత్రాన్ని పే పర్ వ్యూ తరహాలో రిలీజ్ కు ఆఫర్ చేసిందట. ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే చిత్రం ఇలాగే పే పర్ వ్యూ తో విడుదలయింది. దీనిపై రిపబ్లిక్ నిర్మాతలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటె ఒక్క సాయి ధరమ్ తేజ్ కె ఎందుకిలా అవుతుందని అయన అభిమానులు వాపోతున్నారు.. గతంలో సోలోబ్రతుకే సినిమా టైం లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. ఇప్పుడు రిపబ్లిక్ టైం లోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంటుంది. ఏదేమైనా కరోనా సాయి తేజ్ కి శాపంగా మారిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: