ప్రతి హీరో కూడా తమ సినిమాలు హిట్ కొట్టాలనే సినిమాలు చేస్తాడు. ఎంతో శ్రద్ధగా వందకు వందశాతం తన ప్రతిభను ఆ సినిమాపై ఉపయోగించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి తన వంతు కృషి చేస్తాడు. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే సూపర్ హిట్ గా నిలుస్తాయి ఒకటి రెండు సినిమాలు మాత్రమే వారి కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలుస్తాయి. సగానికి కంటే ఎక్కువ సినిమాలు వారి కెరీర్ లో ఫ్లాప్ గా నిలుస్తాయి అన్న విషయం చాలా మందికి తెలుసు. 

అలా ఒక సినిమా సూపర్ హిట్ కొట్టి వెంటనే ఆ జోష్ లో మరో సినిమా చేస్తే అవి దారుణమైన ఫలితాలనీ మిగిల్చిన హీరోలు ఎవరో, ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ల తర్వాత ఒకటి అరా తప్ప చాలా సినిమాల్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. పసివాడి ప్రాణం తర్వాత వచ్చిన స్వయంకృషి విజయం సాధించింది. యముడికి మొగుడు తర్వాత ఖైదీ నెంబర్ 786, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు తర్వాత స్టేట్ రౌడీ, జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత కొదమసింహం విజయాలు సాధించగా ఘరానా మొగుడు తర్వాత వచ్చిన ఆపద్బాంధవుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

నందమూరి బాలకృష్ణ ముద్దుల మావయ్య సినిమా తర్వాత చేసిన అశోక చక్రవర్తి సినిమా ప్లాప్ అయింది. సమరసింహారెడ్డి తర్వాత సుల్తాన్, నరసింహ నాయుడు నాయుడు తర్వాత భలేవాడివి బాసు డిజాస్టర్ లు అయ్యాయి. డైలాగ్ కింగ్ పెదరాయుడు సినిమా చూసిన తర్వాత సోగ్గాడి పెళ్ళాం సినిమా పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత చేసిన జానీ డిజాస్టర్ గా మిగిలింది. మహేష్ బాబు పోకిరి తర్వాత సైనికుడు, శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం దారుణమైన ఫలితాలు మిగిల్చాయి. రామ్ చరణ్ మగధీర తర్వాత ఆరెంజ్, రంగస్థలం తర్వాత వినయవిధేయరామ బోల్తా కొట్టాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సాహో డీజాస్టర్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: