
మన దేశంతో పాటు పలు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా ఈ భారీ పాన్ ఇండియా మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఒక భారీ మూవీ చేయనున్నారు చరణ్. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఈ సినిమా తాజా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుండగా రామ్ చరణ్ ఇందలో ఒక సిబిఐ అధికారి పాత్ర పోషించనున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మూవీ తరువాత మరోవైపు ఇప్పటికే చరణ్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు అది ఆయనకు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోవడం జరిగిందని, అలానే ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని అంటున్నారు. మైథలాజికల్ డ్రామా మూవీ గా భారీ స్టార్ క్యాస్టింగ్ తో రూపొందనున్న ఈ సినిమాకి సింహబలుడు అనే టైటిల్ ని ఎంపికచేసినట్లు సమాచారం. అలానే త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు చెప్తున్నారు. గతంలో అన్న ఎన్టీఆర్ నటించిన సింహబలుడు మూవీ మంచి విజయం అందుకుంది, మరి నిజంగానే చరణ్ హీరోగా త్వరలో రూపొందనున్న మూవీకి ఆ టైటిల్ ని ఫిక్స్ చేస్తారా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు ..... !!