స్టార్ హీరోల కెరీర్లో కొన్ని సినిమాలు అద్భుతంగా వచ్చినప్పటికీ అభిమానుల అంచనాలతో రెజల్ట్స్ తారుమారవుతాయి. కానీ ఆ సినిమాలు ఎప్పటికీ ది బెస్ట్‌గానే నిలుస్తాయి. నందమూరి నటసింహం
బాలకృష్ణ కెరీర్లో కూడా ఇటువంటి సినిమానే ఒకటి ఉంది. అదే 2002లో విడుదలైన ‘చెన్నకేశవరెడ్డి’. ఈ
సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అదే నిజం. అప్పటికే ‘సమర సింహారెడ్డి’ సినిమాతో ఫ్యాక్షన్ సినిమాల్లోనూ తనదైన ప్రతిభ కనబరిచిన
బాలయ్య ఆ తరువాత కొన్ని సినిమాలు చేసి ట్రాక్ మారుద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే ఓ మిలటరీ మేజర్ కథను కూడా ఒకే చేశారు.

కానీ అప్పటికే ఇతర హీరోల్లో చాలా మంది ఫ్యాక్షన్ వైపే మొగ్గు చూపుతుండటంతో
బాలయ్య మళ్లీ మరో పవన్ ఫ్యాక్షన్
సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అప్పటికే
చిరంజీవితో ‘ఇంద్ర’ సినిమాను తెరకెక్కిస్తున్న బీ గోపాల్‌ను
బాలయ్య తన తదుపరి
సినిమా గురించి మాట్లాడారు. దానికి ‘ఇంద్ర’ పూర్తయిన వెంటనే మన షూటింగ్ ప్రారంభింద్దామని
బీ గోపాల్ అన్నారు. ఈ సినిమాను ప్రారంభం అప్పుడే వినాయక్‌ను కూడా లైన్లో పెట్టిన
బాలయ్య ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేయమని అన్నాడు. అంతటి
హీరో తనను కథ అడగడంతో వినాయక్ తాను నితిన్‌తో చేయనున్న సినిమాను పక్కన పెట్టి బాలయ్యకు కథ కోసం కసరత్తు మొదలుపెట్టాడు.

అప్పుడే తీహార్ జైలు నుంచి బయటకు వస్తున్న చెన్నకేశవరెడ్డి వినాయక్‌కు గుర్తుకు వచ్చాడు. అంతే వెంటనే కథను సిద్దం చేసి బాలయ్యకు వినిపించాడు. కథలోని యాక్షన్ సన్నివేశాలు, లైన్ అంతా బాగుండటంతో
బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పరుచూరి బ్రదర్స్‌ను పిలిచి వినాయ్ కథకు సంభాషణలు కుదిరినంత త్వరగా సిద్దం చేయమని కోరారు. గోపాల్ గారి
సినిమా దీని తరువాత చేద్దామని
బాలయ్య అన్నాడు. దాంతో
పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. ఇందులో
బాలయ్య డబుల్ రోల్. కుర్ర
బాలకృష్ణ పాత్రకు శ్రియను ఓకే చేయగా, పెద్ద
బాలయ్య పక్కన సౌందర్యను అనుకున్నారు.

సౌందర్య అప్పటికే తెలుగు, తమిళ్,
కన్నడ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు ఓకే చెప్పలేక పోయింది. దాంతో ఈ సినిమాకు టబును ఓకే చేశారు. వెంటనే
సినిమా చిత్రీకరణ ప్రారంభమయింది. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదే సమయంలో చిరు ‘ఇంద్ర’
ఇండస్ట్రీ హిట్ కావడంతో
బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు గత రెండేళ్లలో ఇండస్ట్రీలో హిట్లు అందించిన
బాలయ్య,
ఆది సినిమాతో భారీ హిట్ అందుకున్న వినాయక్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

దాంతో ఈ
సినిమా విడుదల సమయంలో జరిగిన హంగామా అంతాఇంతా కాదు. ఈసినిమా చెన్నకేశవ
రెడ్డి పాత్ర పూనకాలకు పర్యాయ పదంగా చూపుతుంది. ఈ వ
సినిమా అప్పటి వరకు లేని విధంగా 205 సెంటర్లలో విడుదలయింది. ఇందులో ఫలానా సీన్ బాగుంది అనడానికి వీలులేకుండా అన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో నటించిన వారు కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇలా ఈ
సినిమా గురించి చెప్పుకోవాలంటే మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే ఈ
సినిమా తన కెరీర్‌లోని బెస్ట్ వర్క్ అని వినాయక్ అనేక సార్లు చెప్పారు. ఈ
సినిమా ప్లాప్ అనిపించుకున్నా అభిమానులకు మాత్రం ఎప్పటికీ ఫేవరేట్‌గా ఉంటుంది. ఈ సినిమాతో
బాలయ్య ఎన్నో రికార్డులు అందుకున్నారు. కానీ ఈ
సినిమా బాలయ్య మార్కెట్ అయిన రూ.20 కోట్లను అందుకోలేక పోయింది. కానీ చాలా సెంటర్లలో 50 రోజులు, కొన్ని సెంటర్లలో 100 రోజుల పాటు ఈ
సినిమా ప్రదర్శంచడింది.