చాలా మంది హీరోయిన్ లు తమ జీవితాల లో సెటిల్ అయిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరికను చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి అది సాధ్య పడిన ఇంకొంతమందికి ఫ్యామిలీ దృష్ట్యా సాధ్యపడదు. ఇంకొందరు ఫ్యామిలీ ని ఒప్పించి మరీ తమ సినీ కోరికలు తీర్చుకుంటారు. చాలా మంది హీరోలు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాపై ప్రేమను చంపుకోలేక వచ్చి రీ ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసి నటిస్తూ ఉంటారు. ఆ విధంగా వారికి అదృష్టం కలిసి వచ్చి వారితో సినిమాలతో గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంటారు. అలా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. దక్షిణాదిన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భారత సినీ ప్రముఖులలో మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ సినీ నటి సితార.

సితార నాయర్ అని కూడా పిలువబడే ఈమె పలు తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కేరళలో లో పుట్టి పెరిగిన ఈమె  ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో తమిళ చిత్ర సీమలో ప్రవేశించి ఆ తర్వాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. టెలివిజన్ సీరియల్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మంచి విద్యాభ్యాసం చేసిన ఈమె చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది. శాస్త్రీయ నృత్య కళాకారిణిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సితార 2010లో వివాహం చేసుకొని తన సినీ జీవితానికి కామా పెట్టింది. పాడు యప్ప, హలుందా తవరుం,  పాడు వసంతం అనే సినిమాలతో దక్షిణాదిన ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈమె తన కెరీర్లో 60 సినిమాలకు పైగా నటించి మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.

ఇటీవలే శ్రీమంతుడు, శంకరాభరణం మరియు భలే భలే మగాడివోయ్ అనే చిత్రాలతో ఈమె తెలుగులో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. కోలీవుడ్ సినిమా నగేష్ దైర్యరణం అనే సినిమా ద్వారా ఆమె మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడం ప్రారంభించింది. తెలుగులో మనసుమమత సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె స్నేహం కోసం,  లెజెండ్, జనతా గ్యారేజ్, శతమానం భవతి, భరత్ అనే నేను, జోడి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఈమె నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగానే ఉన్నాయి అంటే హీరోయిన్ గా కూడా ఆమె ఇంత బిజీగా లేదని అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: