సినిమాలో హీరోకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, విలన్ పాత్రకి కూడా సినిమాలో అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కోసారి కొన్ని సినిమాలలో హీరో కన్నా విలన్ కే ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది.ఇక ఒకే సినిమాలో హీరో అతనే, విలన్ కూడా అతనే అయితే ఆ సినిమా కథ మరింత ఆసక్తిగా మారుతుంది. అలా ఒక సినిమాలో హీరో అతనే, విలన్ గా కూడా అతనే నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


1). గోపీచంద్ - గౌతమ్ నంద:సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, హన్సిక, కేథరిన్ ట్రెసా కలిసి నటించిన చిత్రం"గౌతమ్ నంద". ఇందులో హీరోగా, విలన్ గా ఈయనే నటించాడు.

2). ఎన్టీఆర్ - జై లవకుశ:కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్, రాసి కన్నా, నివేద థామస్ కలిసి నటించిన చిత్రం జై లవకుశ. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా కూడా కనిపిస్తాడు.

3). వెంకటేష్ - నాగవల్లి:పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్, అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ, కమలిని ముఖర్జీ, పూనమ్ కౌర్ వంటి హీరోయిన్ లతో కలిసి నటించిన చిత్రం నాగ వల్లి. ఇందులో రాజా పాత్రలో విలన్ గా కనిపిస్తారు.


4). రజినీకాంత్ - రోబో:డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, రజినీకాంత్, ఐశ్వరరాయ్ కలిసి నటించిన చిత్రం రోబో. ఈచిత్రంలో రజనీకాంత్ విలన్ గా కూడా రోబో వేశంలో నటిస్తాడు.


5). కార్తి - కాష్మోరా:డైరెక్ట్ గోకుల్ దర్శకత్వంలో  కార్తీ, నయనతార, శ్రీదివ్య కలిసి నటించిన చిత్రం"కాష్మోరా". ఈ చిత్రంలో కార్తీక్ ఒక రాక్షస విలన్ గా కనిపిస్తాడు.

6) సూర్య - సూర్య 24:డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా, సమంత, నిత్యామీనన్ కలిసి నటించిన చిత్రం " 24".ఈ చిత్రంలో విలన్ సూర్యనే.


7) అజిత్ కుమార్ - వాలి:ఎస్.జె.సూర్య దర్శకత్వంలో అజిత్ హీరోగా, సిమ్రాన్, జ్యోతికా కలిసి నటించిన చిత్రం"వాలి".ఈ చిత్రంలో అజిత్ కూడా విలన్ గా నటించాడు.

8). బాలకృష్ణ - సుల్తాన్:శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ, కృష్ణంరాజు, కృష్ణ, రోజా, రచనా, దీప్తి భట్నాగర్ కలిసి నటించిన చిత్రం"సుల్తాన్". ఈ చిత్రంలో బాలకృష్ణ విలన్ గా నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: