
ఇటీవల చికిత్స తీసుకుంటూ కత్తి మహేష్ తుది శ్వాస విడిచారు ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సంతాపం తెలియజేశారు. అయితే ఇటీవలే కత్తి మహేష్ మృతి నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. కత్తి మహేష్ మృతికి తనదైన శైలిలో సంతాపం ప్రకటించారు పూనం కౌర్. నా తప్పు లేకపోయినా ప్రతి రోజూ చస్తూ బతికాను.. నా మనసులో ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది.. ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జరిగిందని.. ఇప్పుడు కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఒక రాజకీయ పార్టీ తమ పరువు కోసం ఒక దళితుడిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. ఏదేమైనా నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఓం శాంతి అంటూ పూనం కౌర్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే పూనమ్ కౌర్ పెట్టిన పోస్టులో ఎలాంటి పేర్లు మెన్షన్ చేయలేదు కానీ ఇక ఈ పోస్టు మాత్రం కత్తి మహేష్ గురించి పెట్టింది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో పూనం కౌర్ కత్తి మహేష్ ను మధ్య ఒక రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. పవన్ కళ్యాణ్ విషయంలో వీరిద్దరు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. ఇక ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పెట్టుకున్న పోస్టులతో సోషల్ మీడియా షేక్ అయింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ నాలుగో భార్య పునం కపూర్ అంటూ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇక కత్తి మహేష్ కి యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు సీతను నీ అవసరానికి ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నావ్. ఎన్నో ఏళ్ల నుంచి పద్ధతిగా నా పని నేను చేసుకునే బ్రాహ్మణుల అమ్మాయిని నేను.. నువ్వు ప్రాణాలతో బయట పడాలని కోరుకుంటున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇక ఇటీవల కత్తి మహేష్ మృతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిపోయాయి.