ఆమె పేరే సహజ నటి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర నటులు సైతం ఆమె నటనకు కితాబు ఇచ్చినవారే. ఆమె తమ సినిమాలో ఉంటే హిట్ గ్యారంటీ అని టాప్ హీరోలు ఒకనాడు ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూసిన వారే కావడం విశేషం. ఇక తెలుగు తమిళ రంగాలలో ప్రఖ్యాత డైరెక్టర్లు తమ సినిమాలలో ఆమెను హీరోయిన్ గా తీసుకుని వరస హిట్లు కొట్టారు.

అటువంటి జయసుధ నటనను సరిగ్గా ఉపయోగించుకోలేదా లేక ఆమె స్థాయికి తగిన పాత్రలు పడలేదా అన్నది తెలియదు కానీ కళా తపస్వి విశ్వనాధ్ సినిమాల్లో మాత్రం జయసుధ జస్ట్ గ్లామర్ డాల్ గానే కనిపించింది. విశ్వనాధ్ టేస్ట్ కి తగిన సినిమాలు కూడా అవి కావనే చెప్పాలి. నిజానికి జయసుధ నటనను విశ్వనాధ్ డైరెక్షన్ని  తీసుకుంటే అద్భుతమైన కళాఖండాలే రావాలి. కానీ ఎక్కడో మిస్ అయింది మరి.

విశ్వనాధ్ డైరెక్షన్ లో జయసుధ జీవిత నౌక, కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఇందులో జయసుధ నటనకు కూడా పెద్దగా స్కోప్ లేదుకూడా. ఇక ఈ సినిమాలు కూడా విశ్వనాధ్ తీశారా అనిపించేలా ఉంటాయి. విశ్వనాధ్ అంటే ఒక సిరిసిరిమువ్వ, శంకరాభరణం వంటివి చెప్పుకుంటారు కానీ ఇవి ఫక్త్ కమర్షియల్ మూవీస్.  ఇందులో జయసుధ కేవలం ఆడి పాడే సగటు హీరోయిన్ గానే కనిపిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. విశ్వనాధ్ శంకరాభరణం తరువాత తీసిన  సాగర సంగమం మూవీలో మొదట జయసుధనే హీరోయిన్ గా అనుకున్నారుట. ఆమెకు కాల్షీట్లు సర్దుబాటు కాక ఆ చాన్స్ వదులుకుంటే జయప్రదకు దక్కింది ఆ పాత్ర. ఆ సినిమా కనుక జయసుధ చేసి ఉంటే కళాతపస్వి కాంబోలో ఒక కళాఖండమే ఆమె ఖాతాలో పడేది అని అంటారు అభిమానులు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: