ఒక భాషలో రిలీజైన సినిమా సూపర్ హిట్టైతే మరో భాషలోకి రీమేక్ చేయడం కామన్ గా జరుగుతున్నదే. తెల్గు సినిమాలో సూపర్ గా ఆడిన చాలా సినిమాలు మరో భాషలోకి రీమేక్ అయ్యాయి. అయితే ఎంచుకున్న సినిమా ఎలాంటిది అన్న దాన్ని బట్టి కథ అక్కడ నేటివిటీకి దగ్గరగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని కథలు మాత్రం ఏ భాషలో చేసినా జస్ట్ నటీనటులు మారుతారు తప్ప కథలో పెద్దగా మార్చాల్సిన అవసరం ఉండదు. ఆ స్కోప్ కూడా దొరకదని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా అసురన్ రీమేక్ గా నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమా రీమేక్ ను యాజిటీజ్ గా దించేశారన్న టాక్ కూడా వస్తుంది. అయితే దీనిపై ధనుష్ వర్సెస్ వెంకటేష్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. అసురన్ సినిమాలో ధనుష్ నటనతో నారప్ప లోని వెంకటేష్ నటనని పోల్చేస్తున్నారు ధనుష్ ఫ్యాన్స్. అయితే ధనుష్, వెంకటేష్ ఎవరి స్టైల్ లో వారు నటించారు. అసురన్ సినిమాలో ధనుష్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది. నారప్పలో వెంకటేష్ కూడా అదే రేంజ్ లో నటించాడు.

ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అంతేకాదు కొందరు సినిమా యాక్టర్లు మాత్రమే మార్పు మిగతా అంతా డిటో అని ట్రోల్ చేస్తుంటే రీమేక్ సినిమా చేస్తే అదే కథ కాకుండా టైటానిక్ వస్తుందా అని కొందరు వెంకటేష్ ఫ్యాన్స్ సమాధానం ఇస్తున్నారు. ఇక కామన్ ఫ్యాన్స్ మాత్రం సినిమాని సినిమాగా చూడాలి. ఇద్దరు బాగా చేశారని చెబుతున్నారు. చూడాల్సింది సినిమా కాని ఎవరు బాగా చేశారని కాదని అంటున్నారు. మొత్తానికి నారప్ప సినిమాతో ధనుష్ ఫ్యాన్స్ మరోసారి వెంకటేష్ ఫ్యాన్స్ తో గొడవ పడ్డారని చెప్పొచ్చు. అయితే పోలిక పెట్టకుండా చూస్తే అసురన్ లో ధనుష్ అదరగొట్టినట్టే నారప్పలో వెంకటేష్ కూడా దుమ్ముదులిపేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: