పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'.17 శతాబ్దం నాటి మొగలాయిలు,కుతుబ్ షాహిల శకం నేపథ్యంలో జరిగే కథగా ఈ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు.పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా సూర్య బ్యానర్ పౌ ఏ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక భారతీయ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని కథ ఇదని.. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ మరపురాని అనుభవాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.ఇక సాయి మాధవ్ మాట్లాడుతూ.."హరిహర వీరమల్లు ఒక నెక్స్ట్ లెవల్ మూవీ.ఈ సినిమాకి ఒక అద్భుతమైన కథ ఉంది.కచ్చితంగా ఈ సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కాలర్ ఎగరేస్తారు.గర్వంతో తమ గుండెలపై చేతులు వేసుకోవచ్చు.ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని నేను నమ్ముతున్నాను"అంటూ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు.అన్నట్టు ఈ సినిమాకి డైలాగ్స్ రాసేది సాయి మాధవే.అందుకే ఈ సినిమాపై అంత నమ్మకంతో ఉన్నాడు ఈ రచయిత.

ఇక పవన్ కళ్యాణ్, క్రిష్ ల కాంబినేషన్లో మొదటి సినిమా ఇదే కావడం విశేషం. సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటూ హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.ఇక ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదాపడగా.. ఇటీవలే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: