అక్కినేని హీరో నాగచైతన్య సినిమా కథలు ఎంచుకునే పద్ధతి మారినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ సూపర్ యాక్టర్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న నాగచైతన్యమూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా హాలీవుడ్ లో తీసిన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.అయితే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్యకు  ఈ సినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా
ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లు సమాచారం. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన పాత్ర ఇది.ఈ చిత్రం నుంచి విడుదలైన కొన్ని పిక్స్ చూస్తుంటే అతను ఒక సైనికుడిగా కనిపించనున్నాడని అర్దమవుతుంది. టామ్ హాంక్స్ నటించిన 'ఫారెస్ట్ గంప్'ఒరిజినల్లో 'బబ్బా' అనే ఇంట్రస్టింగ్ పాత్ర ఉంటుందట. సైన్యంలోకి అడుగు పెట్టిన హీరోకు అక్కడ దొరికే ఏకైక స్నేహితుడు బబ్బానే. బబ్బా కాస్త చిత్ర,విచిత్రమైన హావాభావాలతో అమాయకంగా కనిపిస్తాడు. అతడితో స్నేహం చేయడానికి హీరో ఎంతో ఇష్టపడతాడట .

ఆర్మీ నుంచి రిటైరయ్యాక పెద్ద ఓడ కొనుక్కుని దాని ద్వారా సముద్రంలో చేపలు పట్టాలన్నది అతడి కల. కానీ అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సన్నివేశాలు చాలా సెంటిమెంట్ తో కూడి ఉంటాయి. హీరో సైన్యం నుంచి వెళ్ళిపోయాక బబ్బా కలను నెరవేరుస్తాడు. సినిమాలో ఈ పాత్ర ఉండేది  30 నిమిషాలే కానీ దాని ప్రభావం మాత్రం సినిమా అంతా కొనసాగుతుందట . ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి.

నాగ చైతన్య  హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. మంచి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాపులర్ అయ్యాయి. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీఖన్నాతో అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: