టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా ఎన్ని సంచలన రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయిన మహేష్ బాబుకు ఒక్క‌డు సినిమా కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అప్పటికే మృగరాజు లాంటి డిజాస్ట‌ర్‌ సినిమాతో ఉన్న గుణశేఖర్ కు మ‌రో ఛాన్స్ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. అయితే మహేష్ బాబు మాత్రం గుణశేఖర్ చెప్పిన కథను నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు 2003లోనే 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ కెరీర్లో తొలిసారి 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా ఒక్కడు రికార్డులకు ఎక్కింది.

మహేష్ బాబు సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించాడట. వాస్తవంగా చూస్తే ఒక్కడు సినిమాలో కథంటూ పెద్దగా ఉండదు. గుణశేఖర్ చెప్పిన కథ గురించి ఆలోచించిన ప్రభాస్ పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేశాడట. తర్వాత ఇదే క‌థ‌తో పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయాలని గుణశేఖర్ అనుకున్నాడ‌ట‌. అప్పటికే చిరంజీవితో మృగరాజు లాంటి ఘోర‌మైన ప్లాప్‌ను తెరకెక్కించడం తో గుణశేఖర్ ను మెగా కాంపౌండ్ న‌మ్మ‌ లేదట.

చివరకు గుణశేఖర్ మహేష్ బాబు కు ఈ కథ చెప్పి ఒప్పించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్న ఒక్కడు 2003 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు పోటీగా ఎన్టీఆర్ నాగ కూడా రిలీజ్ అయింది. అయితే ఒక్కడు మహేష్ బాబు కెరీర్లో అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి మహేష్ ని సూప‌ర్‌ స్టార్ట్ ను చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: