మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'లూసిఫర్' రీమేక్ చేస్తున్నాడు. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో చిరు పొలిటీషియన్‌గా నటిస్తున్నాడు. అయితే లూసిఫర్ రోల్ పొలిటీషియన్ అయినా వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్‌తోనే అన్నిటిని కంట్రోల్ చేస్తుంటాడు. సో చిరు క్యారెక్టర్‌ కూడా ఇలాగే పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పొచ్చు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటిస్తోన్న సినిమా 'ఆచార్య'. ఈ మూవీలో చిరంజీవి మల్టిపుల్‌ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. నక్సలైట్‌గా, ఎండోమెంట్‌ బోర్డ్ ఉద్యోగిగా విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. దేవాదాయశాఖ ఉద్యోగిగా సింపుల్‌గా కనిపిస్తూనే చిరంజీవి భారీ యాక్షన్‌ సీన్స్‌ చేస్తాడని తెలుస్తోంది.

సాయి ధరమ్‌ తేజ్‌ మెగాఫ్యామిలీకి భారీగా ఉన్న మాస్ ఫాలోయింగ్‌ని మెప్పించడానికి ఎక్కువగా కమర్షియల్‌ మూవీసే చేస్తున్నాడు. కొన్నిసార్లు ఈ మాస్‌ ప్లాన్స్‌ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో 'చిత్రలహరి' లాంటి లవ్‌స్టోరీస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కలెక్టర్‌ పంజా అభిరామ్ పాత్ర పోషిస్తున్నాడు తేజు.

రవితేజకి మాస్ మహారాజ్‌ ఇమేజ్ ఉంది. కంప్లీట్‌ కమర్షియల్ మూవీస్‌తో బాక్సాఫీస్ బరిలో దిగుతుంటాడు. అయితే ఇప్పుడీ హీరో కొంచెం క్లాస్ కొంచెం మాస్ మిక్సింగ్‌లో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా చేస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ ఆర్డీవోగా నటిస్తున్నాడని సమాచారం.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో క్రేజీ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హీరో నాని. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథలు చేస్తోన్న ఈ హీరో శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్‌ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాని గవర్నమెంట్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడట. అయితే ఇప్పటికే వచ్చిన టీజర్స్‌తో 'టక్‌ జగదీష్'లో మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది.చూద్దాం.. హీరోల మాస్ మంత్రం ఏ విధంగా పనిచేస్తుందో. 





మరింత సమాచారం తెలుసుకోండి: