తనదైన నటనతో ప్రేక్షకులలో తిరుగులేని స్థాయిలో నిలిచిపోయాడు కమలహాసన్. కమలహాసన్ ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అద్భుతంగా నటిస్తాడు. ఆ పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. అంత గొప్పగా నటిస్తాడు. ఆయన నటించి మెప్పించిన సినిమాలలో 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ అయిన "భారతీయుడు" బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం అందరకు తెలిసిందే. భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వ ప్రతిభ తారస్థాయికి చేరిందని అందరు ఆయనను మెచ్చుకున్నారు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ నటించి మెప్పించిన ఓల్డ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకు A.R రెహ్మాన్ మంచి సంగీతం అందించారు. ఈ సినిమాతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ కు మంచి పేరు వచ్చింది.ఆ సినిమా విడుదల అయిన దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా కమల్ హాసన్ మరియు శంకర్ కలిసి "భారతీయుడు-2" సినిమా తీస్తున్నారు.లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిందట. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ తరువాత బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య గొడవలు జరిగి సినిమా షూటింగ్ ఆగిపోయే స్థాయికి చేరుకుందని వార్త వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా పెట్టారట. చాలాకాలంపాటు కోర్టులో నలిగిన ఈ కేసు నుండి శంకర్ ఈ మధ్యనే బయటపడినట్లు సమాచారం.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులు ఈ సినిమా ఆగిపోయింది ఇంక పూర్తికాదు అనే వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితిలో భారతీయుడు -2సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం తెలిపాదట.భారతీయుడు-2 సినిమా గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ "సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయిందని తెలిపారు. ప్రస్తుతానికి మేము సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారట. 'విక్రమ్' సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలవుతుంది," అని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మధ్యనే ఫాహాధ్ ఫాసిల్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "మాలిక్" సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్ నారాయణ తదుపరి సినిమా కోసం కమల్ హాసన్ స్క్రిప్టు అందిస్తున్నారని సమాచారం. ఈ విషయం కమల్ హాసన్ స్వయంగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటి నేటివిటీ తగ్గట్టు వస్తున్న భారతీయుడు -2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: