పాకిస్తాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది శత్రుదేశం అని. అయినప్పటికీ బాలీవుడ్ సినిమాలను అక్కడ కూడా రిలీజ్ చేస్తారు. అయితే కొన్ని సినిమాలను అక్కడ బ్యాన్ చేశారు. ఇటీవల విడుదలైన వార్ మూవీ "షేర్షా" కూడా అక్కడ బ్యాన్ అయ్యింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాకు ఇక్కడ మంచి స్పందన వస్తోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాలలో ఒకటని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై పాకిస్తాన్‌లో నిషేధించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కొన్ని భారతీయ సినిమాలు అక్కడ బ్యాన్ అయ్యాయి. అవేంటంటే...

ఫాంటమ్
సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'ఫాంటమ్' చిత్రం వివాదాస్పద కంటెంట్ కారణంగా పాకిస్తాన్‌లో బ్యాన్ అయ్యింది. ఈ మూవీ హుస్సేన్ జైదీ నవల 'ముంబై ఎవెంజర్స్' ఆధారంగా రూపొందించబడింది. జమాత్-ఉత్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ వ్యతిరేక చిత్రం కాబట్టి దీనిని నిషేధించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

బంగిస్తాన్
ఈ సినిమాతో కరణ్ అన్షుమన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రితేష్ దేశ్ ముఖ్, పుల్కిత్ సామ్రాట్ నటించిన 'బంగిస్తాన్' చిత్రం కూడా పాకిస్తాన్‌లో నిషేధించబడింది. ట్రైలర్ తోనే సినిమా రిలీజ్ ను బ్యాన్ చేశారు. రితేష్ పాకిస్తాన్ హై కమిషన్‌ను సంప్రదించి, సినిమాలో చేసిన వ్యంగ్యం పాకిస్తాన్‌కు వ్యతిరేకం కాదని చెప్పాడు. అయినప్పటికీ ఈ చిత్రం అక్కడ విడుదల కాలేదు.

ఏక్ థా టైగర్
భారతదేశ రా, పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చుట్టూ ఉన్న ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. సల్మాన్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఏం లాభం ?

రంజానా
ధనుష్, సోనమ్ కపూర్ మరియు అభయ్ డియోల్ నటించిన ఈ మూవీ ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి, ఒక సిక్కు అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్‌కు చాలా ఇబ్బంది కలిగించింది.

భాగ్ మిల్ఖా భాగ్
మిల్ఖా సింగ్ 'ఫ్లయింగ్ సిక్కు ఆఫ్ ఇండియా' బయోపిక్ చూసి చాలా మంది కన్నీటి పర్యంతమయ్యారు. సినిమా నేపథ్యం ఇండియా-పాకిస్తాన్ విభజన. ఇండియా తమ దేశాన్ని సినిమాలో సరిగ్గా చూపించలేదని పాకిస్తాన్ భావించింది.

డర్టీ పిక్చర్
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీని భారతదేశంలో ఏ సర్టిఫికెట్‌తో విడుదల చేయబడింది. ఈ మూవీ బోల్డ్ కంటెంట్ పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్‌కి ఇబ్బంది కలిగించింది. ఇంకా ఏజెంట్ వినోద్, తెర బిన్ లాడెన్, లాహోర్ వంటి చిత్రాలు కూడా అక్కడ బ్యాన్ కు గురయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: