తాలిబన్లు , ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు హస్తగతం చేసుకోవడాన్ని సమర్పించినట్లుగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల పాటు అమెరికా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉంచింది. కానీ ప్రస్తుతం ఈ దారుణమైన సమయంలో మాత్రం అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తెచ్చుకుంటుంది. ఇప్పటికే చాలా మంది సైనికులను వెనక్కు తప్పించుకున్న అమెరికా మిగతా వారిని కూడా ఆగస్టు 31 వరకు తిరిగి తమ దేశానికి తెచ్చుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబూలు ఎయిర్ పోర్ట్ నుండి వివిధ దేశాల ప్రజలు, అర్హత కలిగిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ విషయం మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించేందుకు తాలిబ‌న్లు కృషి చేస్తారా..? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఒకవేళ తాలిబన్లు కనుక అలా చేయగలిగితే ఆఫ్ఘ‌న్‌కు ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ చాలా ఘాటుగా స్పందించాడు. చెప్పుతో కొడతా వెధవ..అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై నిఖిల్ నిప్పులు చెరిగాడు. స్వేచ్ఛ ప్రపంచం అనేదానికి అమెరికా ఉదాహరణ లాంటిది. కానీ అది ఇప్పుడు లేదు. ఇరవై ఒక్క సంవత్సరాలు ఎన్నో కష్టాలు పెట్టారు. ఇప్పుడు ఇలా దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. నువ్వు ఇంకెప్పుడైనా ఫ్రీడం గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది వెధవ అని నిఖిల్ సిద్దార్థ్ వ్యాఖ్యలు చేశాడు. హీరో నిఖిల్ సిద్ధార్థ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: