సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా, కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఈనెల 27వ తారీకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ సినిమా గురించి మరియు ఇతర విషయాల గురించి కూడా అనేక ఆసక్తికరమయిన విషయాలను తెలియజేశారు. కరుణ్ కుమార్ మాటల ప్రకారం  ఇతర భాషలలో వస్తున్న సినిమాలను చూసి అలాంటి సినిమాలు మన భాషలో రావటం లేదు అని అనుకుని ఇతర భాషల సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. శంకరాభరణం ,జ్యోతి, సిరివెన్నెల, విజేత, లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తెలుగులో వఛినన్ని వేరే ఇతర ఏ భాషలో రాలేదు అని అన్నారు. ప్రపంచాన్ని మొత్తం షేక్ చేసిన బాహుబలి , అరుంధతి లాంటి సినిమాలు కూడా మన తెలుగు భాష వే అని ఆయన అన్నారు. మంచి కథలను చెప్పడానికి నేను ఇండస్ట్రీకి వచ్చాను.

నేను రాసుకునే సినిమా కథల్లో , కథలే హీరోలు అని కరుణ కుమార్ అన్నారు. ఇక దర్శకుడు కరుణ కుమార్ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా గురించి మాట్లాడుతూ అమలాపురం పక్కన ఉన్న గ్రామాల బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ఓ సోడా సెంటర్ యజమాని కూతుర్ని ఎలక్ట్రిషన్ లవ్ చేస్తాడు. అక్కడి ప్రాంతాల్లోని సామాజిక, సాంఘిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైంది..? అనేదే ఈ సినిమా కథ అని కరణ్ కుమార్ తెలియజేశాడు. మరియు కరుణ కుమార్ సుదీర్ గురించి మాట్లాడుతూ సుధీర్ కు రెండు కథలు చెబితే అందులో 'శ్రీదేవి సోడా సెంటర్' కథను ఎంచుకున్నట్లు గా తెలియజేశాడు. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలామంది తెలుగు అమ్మాయిల కు ఫోన్ చేశాను , కొంతమంది సినిమాలో హీరో ఎవరు అని అడిగారు. మరికొంతమంది తమ మేనేజర్లకు కథ వినిపించమని చెప్పారు. అంతే కానీ ఈ కథను ఎవరూ వినలేదు అని దర్శకుడు కరుణ కుమార్ తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాకు నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా తెలియజేశాడు. మరియు ఈ సినిమాకు మణిశర్మ అందించిన స్వరాలు మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయని  కూడా దర్శకుడు ఈ సందర్భంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: