రావు గోపాలరావు సినీ ఇండస్ట్రీలో ఒక ఉత్తమ విలన్ గా గుర్తింపు పొందాడు.. ఈయన కొడుకు రావు రమేష్ కూడా విలన్ పాత్రలకు పెట్టింది పేరు.. స్టార్ హీరోల సినిమాలలో వారికి దీటుగా ప్రతినాయకుడి పాత్రలో, నటించి ప్రేక్షకులను అలరించిన ఆనాటి విలన్ గా ఈయన మంచి గుర్తింపు పొందాడు.. ఆనాటి కాలంలో ఎక్కువగా తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర రావు గోపాలరావు మాత్రమే వేసేవారు. ఈయన రంగస్థల నటుడిగా గుర్తింపు పొంది, ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి విలన్ గా అడుగుపెట్టి గుర్తింపు పొందాడు..ఈయన 1937 వ సంవత్సరంలో జనవరి 14 వ తేదీన కాకినాడ దగ్గరలో ఉన్న గంగనపల్లి లో జన్మించాడు.. నటన మీద ఉన్న ఆసక్తి.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకునేలా చేసింది. క్రాంతి కుమార్ నిర్మాణంలో వచ్చిన శారద అనే సినిమా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు రావు గోపాల్ రావు. ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు సినిమా తర్వాత ఆయన సినీ జీవితంలో వెనుతిరిగి చూడలేదు అని చెప్పవచ్చు.. ఎన్నో అవకాశాలు దక్కించుకుంటూ ఆర్థికంగా కూడా బాగా ఎదిగిన , కేవలం ముందు చూపు లేని కారణంగా డబ్బునంతా పోగొట్టుకున్నాడు..అందరిని నమ్మి డబ్బులు ఇచ్చి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేక వున్న డబ్బును కూడా చికిత్స కోసమే ఖర్చు పెట్టాడు.. 1994 ఆగస్టు 13వ తేదీన ఆయన చికిత్స పొందుతూ మరణించాడు.. రావు రమేష్ మరణించే సమయానికి చిత్ర పరిశ్రమ ఇంకా చెన్నైలోనే ఉండటంతో.. ఆయన మరణవార్త తెలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడం కోసం ఎవరూ రాకపోవడం గమనార్హం.. పి.ఎల్.నారాయణ ,అల్లు రామలింగయ్య, రేలంగి నరసింహారావు, నిర్మాత జయకృష్ణ ,వంటి కొంత మంది వచ్చారు. అయితే ఆయన కొడుకులు అగ్ని కారం చేస్తున్న సమయంలో కొంతమంది తమిళ సోదరులు వచ్చి ఆపండి అంటూ.. భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఇక చుట్టూ చూసి అల్లు రామలింగ ఎవరు రాలేదని చెప్పడంతో తో ఆయనకు దహనసంస్కారాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: