ఇప్పట్లో అయితే అన్ని అడాల్ట్ సినిమాలతో తన స్థాయిని కించపరచు కుంటున్నాడే తప్ప అప్పట్లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రాంగోపాల్ వర్మ. శివ, రక్త చరిత్ర లాంటి సినిమాలను తెరకెక్కించి, యాక్షన్ అంటే ఇది..! అని ప్రేక్షకులు అనేలాగ ఎంతో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే కాకుండా, హీరోల సినీ జీవితాన్ని కూడా మార్చేసిన ఏకైక దర్శకుడు. అప్పట్లో ఆర్జీవీ ఏదైనా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే , ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే వారు. ఎందుకంటే ఈయన అప్పట్లోనే ఫుల్ భారీ యాక్షన్ సినిమాలు ఇస్తాడు.. కాబట్టి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఎదురు చూసేవారు.


అలా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కిన చిత్రం శివ. ఈ చిత్రం చూసినంత సేపు ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసే లాగా చేసింది. ఎక్కడ కూడా ఒక రెప్ప పాటు బోర్ కొట్టకుండా సినిమా మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. ఇక యాక్షన్ సీన్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రతి సీను కూడా ప్రేక్షకుల వెన్నులో భయం పుట్టించేలా చేశారు. ఈ సినిమా తర్వాత కాలేజీ యువకులు కూడా సైకిల్ చైన్ పట్టుకొని శివ అంటూ గ్యాంగ్ స్టర్ లుగా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అంతలా యువతను కూడా బాగా ఆకట్టుకుంది ఈ సినిమా.

సినిమా 1989 సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని వెంకట్, ఎస్. ఎస్. క్రియేషన్స్ బ్యానర్ పై యార్లగడ్డ సురేంద్ర సంయుక్తంగా నిర్మించారు. రఘువరన్ ఈ సినిమాలో విలన్ గా చాలా బాగా నటించాడని చెప్పవచ్చు. అమల హీరోయిన్ గా తన నటనను ప్రేక్షకులకు కనబరిచింది. అయితే 1972వ సంవత్సరంలో విడుదలైన ద వే ఆఫ్ డ్రాగన్ సినిమా లోని ఒక బేసిక్ పాయింట్ ని తీసుకొని ఈ సినిమాను ఆర్జీవి ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాను 7.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తో పాటు ఉత్తమ మొదటి దర్శకుడిగా కూడా ఆర్జివి నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక బెస్ట్ రచయితగా తనికెళ్ల భరణి నంది అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఈ చిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: