సరిహద్దుల్లోకి వెళ్ళాలి అనే సైనికుడు.. దేశం తరఫున పోరాటం చేయాలి అని ఎంతలా ఆరాట పడుతూ ఉంటాడు.. అంతేకాదు ఇక సరిహద్దుల్లో కి వెళ్లడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ..  ప్రేక్షకులు అందరినీ మంత్ర ముగ్దులను చేస్తూ ఇక తన యాక్షన్ తో లుక్ తో ఎంతో మందిని ఆకర్షించి.. ఇక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సాధారణంగా ఏదైనా సినిమా చేస్తున్నారంటే పాత్రకు తగ్గట్టుగా తన బాడీని మార్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే నా పేరు సూర్య అనే సినిమాలో ఒక సైనికుడి పాత్రలో నటించిన అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుని ఆశ్చర్యానికి గురి చేసాడు.



 ఇక ఈ సినిమాలో పాత్ర కోసం బాడీ పెంచడమే కాదు తన లుక్ మొత్తం మార్చేసాడు.  ఎప్పుడు సినిమాల్లో లవర్ బాయ్ లాగా కనిపించే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా లో సీరియస్ గా కనిపించాడు. అంతేకాదు ఇక ఈ సినిమాలో ఎక్కువ కోపం ఉన్న సైనికుడి పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ చేసిన యాక్షన్  మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది అనే చెప్పాలి.  మామూలుగానే బన్నీ యాక్షన్ సన్నివేశాలను ఇరగదీస్తూ ఉంటాడు  నా పేరు సూర్య సినిమా లో అయితే అంతకుమించి అనే రేంజ్ లోనే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు అల్లు అర్జున్.


 ఏకంగా అతి కోపం తో ఉండే అల్లు అర్జున్ ఎవరు ఏమన్నా సరే విరుచుకుపడుతూ ఉంటాడు.  ఇలా తన కోపంతో ఎన్నో గొడవలు పెట్టుకుంటూ అందరిని చితకబాదుతూ ఉంటాడు అల్లు అర్జున్. ఇలా సినిమా మొదలైన నాటి నుంచి చివరి వరకు కూడా తన యాక్షన్ సన్నివేశాలు తన డైలాగ్ లతో  అల్లు అర్జున్ అదరగొట్టాడు అనే చెప్పాలి. సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్లుగా వచ్చే మ్యూజిక్ అయితే మరింత అదిరిపోయింది. ఇలా మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని కలగలిపిన ఒక విందు భోజనంలా మాస్ ప్రేక్షకులకు నా పేరు సూర్య సినిమా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: