అప్పటి వరకు ఎవరికీ తెలియని అపరిచితురాలుగా ఉన్న అనసూయ జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం తర్వాత ఇక ఈ బుల్లితెర కార్యక్రమం లో యాంకర్ గా ప్రత్యక్షం అయి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది.  ప్రస్తుతం బుల్లి తెరపై తిరుగులేని కామెడీ షో గా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న జబర్దస్త్ లో పర్మినెంట్ యాంకర్ గా మారిపోయింది అనసూయ. ఇక అనసూయ ఎప్పుడు జబర్దస్త్ లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడమే కాదు..  అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అలరిస్తూనే ఉంది.



 అయితే ఇక తన కెరియర్ను బుల్లితెర వరకే లిమిట్స్ పెట్టుకోకుండా ఏకంగా వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం కీలక పాత్రల్లో నటించి  తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది అనసూయ. ఇకపోతే అటు జబర్దస్త్ కార్యక్రమం లో స్కిట్ జరుగుతున్న సమయంలో అనసూయ అప్పుడప్పుడు స్కిట్ లో భాగం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలె ఏకంగా యాంకర్ అనసూయ స్టేజి మీద ఒకరికి ముద్దు పెట్టింది.



 ఇటీవలే విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమో లో భాగంగా..  హైపర్ ఆది స్కిట్ ప్రారంభం అవుతుంది. మురారి అనే బుడ్డోడు ఎంట్రీ ఇస్తాడు.  ఇక కొత్తగా జబర్దస్త్ కు వచ్చినప్పటికీ తనదైన శైలిలో కామెడీ పంచులు వేసి అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు. స్పాంటేనియస్ పంచులతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఆ బుడ్డోడి కామెడీ టైమింగ్ కు అక్కడే ఉన్న యాంకర్ అనసూయ ఫిదా అవుతుంది. స్కిట్ అయిపోగానే స్టేజి మీదికి వచ్చి ఆ బుడ్డోడికి ముద్దు పెడుతుంది. దీంతో ఎంతో సిగ్గుపడి పోయిన ఆ చిన్నోడు.. ఇక ఇది చాలులే.. పేమెంట్ కూడా అవసరం లేదు అంటూ మరో పంచ్ వేయడంతో అనసూయ ఆశ్చర్యపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: