టాలీవుడ్ హీరోలకు ఒక్కో పండగ కొందరికి కలిసి వస్తుంది, మరి కొందరికి కలిసి రాదు.అలా కలిసొచ్చిన మన స్టార్ హీరోలు సైతం ఎలాగైనా ఆ సినిమాని వారికి అచ్చొచ్చిన ఆ పండక్కి విడుదల చేయాలని చూస్తూ ఉంటారు. ఒక సారి సంక్రాంతి బరిలో కొన్ని సినిమాలు విడుదల కాగా, ఆ సినిమాలలో బాలకృష్ణదే పైచేయిగా నిలిచిందట. అది ఏ సినిమానో చూద్దాం.


ప్రతి సంక్రాంతికి మన స్టార్ హీరో సినిమాలు ఏవో ఒకటి విడుదల అవుతూనే ఉంటాయి. అలా 2001 లొ సంక్రాంతి కానుకగా జనవరి 11 తేదీన బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు మూవీ విడుదలైంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ కెరియర్ లోనే అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపుగా 30 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఈ సినిమాకి డైరెక్టర్ బి.గోపాల్ నిర్మించారు. ఇక జనవరి  11 వ తేదీనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ నిర్మించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలు మీద విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ ఆ సంవత్సరం ఫుల్ ఖుషీగా ఉండగా చిరంజీవికి మాత్రం నిరాశ తప్పలేదు.

ఇక ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ లోనే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో హీరో వెంకటేష్ తో తీసిన చిత్రం"దేవి పుత్రుడు".ఈ సినిమా కూడా డిజాస్టర్ తో భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సినిమా కు నిర్మాత ఎమ్మెస్ రాజు.ఇక బాలకృష్ణ సినిమా వల్లే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే.. ఆ సినిమా కి గట్టి పోటీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: