ప్రభుదేవా సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా, నిర్మాతగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా..ఇలా రకరకాలుగా తనలో ఉన్న ప్రతిభను ప్రేక్షకులకు కనబరిచి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా ప్రధానంగా నటించి మొత్తం భారతదేశం అంతటా మంచి గుర్తింపు పొందాడు.. అంతేకాదు విస్తృతమైన నృత్య ప్రదర్శన ఇచ్చి, తన డాన్సులతో ప్రేక్షకులను మైమరపింపచేశాడు. కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి, ఉత్తమ కొరియోగ్రఫీ గా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.. నృత్యానికి 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది..


1973 ఏప్రిల్ 3 వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ముగుర్ సుందర్ -  మహాదేవమ్మ సుందర్ దంపతులకు లింగాయత్ కుటుంబంలో జన్మించాడు.. మొదటిసారిగా మౌనరాగం 1986 వ సంవత్సరంలో వచ్చిన తమిళ సినిమాలు "పనివిజుం ఇరువు" అని పాటలో మనకు వేణు వాయిస్తున్న ఒక బాలుడిగా కనిపించాడు. ఇక అప్పటి నుంచి తమిళ చిత్రాలలో పనిచేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందాడు. ఇక 2010 సంవత్సరం నుంచి సింగపూర్ లో ప్రభుదేవా డాన్స్ అకాడమీ కి ఒక చైర్మన్ అలాగే డైరెక్టర్ గా కూడా పని చేస్తున్నారు.

వ్యక్తిగత విషయానికి వస్తే, ప్రభుదేవా రామ్ లత్  అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక తర్వాత ఈమె లత గా తన పేరును మార్చుకుంది.. వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.. ఇక 2008వ సంవత్సరంలో వీరి పెద్ద కుమారుడు 13 సంవత్సరాల వయసులో కాన్సర్ తో మరణించాడు.. 2010 వ సంవత్సరంలో రామ్ లత్ తన కుటుంబంతో కలిసి  తన భర్త ప్రభుదేవాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కారణం ఏమిటంటే ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార తో ప్రత్యక్ష సంబంధం పెట్టుకున్నాడని, వీరిద్దరూ కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు అని, ఆమె కోర్టులో కేసు వేసింది.. అంతే కాదు నయనతారను  ప్రభుదేవా పెళ్ళి చేసుకున్నట్లయితే, ఆమె ధర్నా కూడా చేస్తానని బెదిరించింది.. కానీ ప్రభుదేవా ఎట్టకేలకు రామ్ లత్ తో విడాకులు తీసుకోవడం కోసం.. 10 లక్షల రూపాయలు నగదు,  అన్నా నగర్ లో ప్రాపర్టీ తో పాటు ఖరీదైన కార్లను కూడా తన భార్య లతకు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: